యంగ్ హీరో నితిన్ కథానాయకుడిగా ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’. పొలిటికల్ ఎలిమెంట్స్ తో మాస్, కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నారు ఈసినిమాను. ఇక ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈనేపథ్యంలో ఈసినిమా షూటింగ్ గురించి అప్ డేట్ ఇచ్చారు. ఈసినిమా షూటింగ్ దాదాపు పూర్తయిందని.. కేవలం ఒక్క పాట మాత్రమే మిగిలిఉందని..మిగిలిన పాటను త్వరలో చిత్రీకరించనున్నామని తెలిపారు. అంతేకాదు ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పార్లల్ గా జరుగుతున్నాయని.. సినిమా ఫస్ట్ హాఫ్ రీరికార్డింగ్ వర్క్ పూర్తయిందని తెలుపుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఒకపక్క ఈసినిమాను రిలీజ్ చేస్తూనే మరోపక్క అప్ డేట్స్ కూడా ఇస్తూనే ఉన్నారు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని రాజ్కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్నారు. కేథరిన్ థ్రెసా ఈ సినిమాలో మరో కథానాయిక గా నటిస్తుంది. ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తుండగా, మహతి స్వర సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు. ‘మాచర్ల నియోజకవర్గం’ ఆగస్ట్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: