డబుల్ ఇస్మార్ట్ సాలిడ్ అప్‌డేట్.. మ్యూజిక్ డైరెక్టర్ అనౌన్స్‌మెంట్
టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కలయికలో వస్తోన్న తాజా చిత్రం 'డబుల్ ఇస్మార్ట్'. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకు సీక్వెల్‌గా ఇది రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొన్నిరోజుల క్రితం విడుదలైన సంజయ్ దత్ ఫస్ట్ లుక్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు మేకర్స్.
పూర్తి వార్త చదవండి


















