ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా హీరోగా వస్తున్న సినిమా హనుమాన్. సూపర్ హీరోస్ నేపథ్యంలో ఫాంటసీ సినిమాగా ఈసినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ, తేజా సజ్జా కాంబినేషన్ లో ఇప్పటికే జాంబిరెడ్డి సినిమా వచ్చి హిట్ అవ్వడంతో ఈసినిమాపై మొదటి నుండీ మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. దానికితోడు ఈ సినిమా నుంచి విడుదలవుతున్న పోస్టర్లు, టీజర్ సహా పలు అప్ డేట్స్ అంచనాలను భారీగా పెంచేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా నుండి ఇప్పటికే ప్రతి మంగళవారం అప్ డేట్ ను ఇస్తున్న సంగతి తెలిసిందే కదా. రిలీజ్ వరకూ ప్రతి మంగళవారం అప్ డేట్ ఇవ్వనున్నారు. ఇక ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే కదా. ప్రశాంత్ వర్మ కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సంబంధించిన అప్ డేట్లను కూడా ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నాడు. ఈనేపథ్యంలోనే తాజాగా మరో అప్ డేట్ ఇచ్చాడు ప్రశాంత్ వర్మ. ఈసినిమా సౌండ్ మిక్సింగ్ స్టార్ట్ అయిందని, డాల్బీ అట్మాస్ వర్క్ జరుగుతోందని.. ఈ ఆడియో జర్నీని ఎక్స్ పీరియన్స్ ను చేయండి అంటూ ట్వీట్ లో తెలిపాడు.
Sound mixing for #HanuMan has begun! 🙏🏽
Experience the immersive audio journey we are creating in #DolbyAtmos ! 😊@Primeshowtweets pic.twitter.com/fGCyU8O2NS
— Prasanth Varma (@PrasanthVarma) November 23, 2023
కాగా ఈసినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ మరో కీలక పాత్రలో నటిస్తుంది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్‌కీ ప్రాధాన్యం ఉంది. ఈసినిమాను ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 భాషల్లో రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: