అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ వంగ ఇప్పుడు మరో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి వస్తున్నాడు. సందీప్ వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా వస్తున్న సినిమా యానిమల్. క్రేజీ కాంబినేషన్ లో ది మోస్ట్ వైలెంట్ సినిమాగా రాబోతున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా డిసెంబర్ 1వ తేదీన రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే కదా. ఇక రిలీజ్ కు మరికొద్ది రోజులు మాత్రమే ఉండటంతో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చి సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమైంది. ఈసినిమా కు ఏ సర్టిఫికెట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా రన్ టైమ్ కూడా ప్రకటించారు మేకర్స్. ఈసినిమా రన్ టైమ్ ఏకంగా 3 గంటల 21నిమిషాల 23 సెకన్ల 16 ఫ్రేమ్స్. మరి గతంలో తను తీసిన అర్జున్ రెడ్డి సినిమా కూడా 3 గంటల పాటు ఉంటుంది. అయితే ఆసినిమా మరో అరగంట ఉన్నా చూసేలా రూపొందించాడు సందీప్ వంగ. అంత ఏంగేజింగా గా తీశాడు ఆసినిమాను. ఇప్పుడు ఈసినిమా కూడా దాదాపు మూడున్నర గంటల పాటు ఉంది. మరి ఈసినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే రిలీజ్ వరకూ వెయిట్ చేయాల్సిందే.
Censor rating for ANIMAL is A 🙂
3 hour 21 minutes 23 seconds & 16 frames is the Runtime 🙂#AnimalTheFilm
Releasing on Dec 1st@VangaPictures@TSeries— Sandeep Reddy Vanga (@imvangasandeep) November 22, 2023
కాగా ఈసినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా.. అనిల్ కపూర్, బాబి డియోల్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు టీ సిరీస్, సినీ వన్ స్టూడియోస్, భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్స్ పై భూషణ్‌కుమార్, కిషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగ, మురాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగులో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రిలీజ్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: