కీర్తి సురేష్ చేతులమీదుగా.. టీ20 మ్యాచ్ ఆన్‌లైన్ టిక్కెట్ సేల్స్ ప్రారంభం

India vs Australia 2nd T20 Match Keerthy Suresh Launched Online Ticket Sales at Thiruvananthapuram

కేరళ క్రికెట్ అసోసియేషన్‌కు గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉండటం గర్వకారణం అని పేర్కొన్నారు నేషనల్ అవార్డు విన్నర్ నటి కీర్తి సురేష్. ఈ మేరకు ఆమె కేరళలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగనున్న రెండో టీ20 మ్యాచ్ కోసం ఆన్‌లైన్ టిక్కెట్ సేల్స్ ప్రారంభించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తిరువనంతపురంలోని స్పోర్ట్స్ హబ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కడకంపల్లి సురేంద్రన్ సమక్షంలో కీర్తి సురేష్ ఈ సేల్‌ను ప్రారంభించారు. కాగా నవంబర్ 26 (ఆదివారం) రాత్రి 7 గంటలకు మ్యాచ్ జరుగనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా కీర్తి సురేష్ మాట్లాడుతూ.. “ఘన చరిత్ర కలిగిన కేరళ క్రికెట్ అసోసియేషన్‌కు గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఈరోజు ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగనున్న రెండో టీ20 మ్యాచ్ ఆన్‌లైన్ టిక్కెట్ సేల్స్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మన దేశ మహిళా క్రికెట్ భవిష్యత్తుకి ఆశాకిరణాలైన ఈ ప్రతిభావంతులైన క్రీడాకారిణులను కలుసుకున్నందుకు ఆనందంగా ఉంది. కేరళకు గర్వకారణమైన క్రికెటర్ మిన్ను మణితో మాట్లాడటం గొప్పగా అనిపించింది. క్రికెట్ అభిమానులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని మ్యాచ్ చూస్తారని ఆశిస్తున్నాను” అని పేర్కొన్నారు.

కాగా తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా జరుగుతున్న ఈ మ్యాచ్ రెండవది. తొలి మ్యాచ్ నేడు ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్టణంలో జరుగుతోన్న విషయం తెలిసిందే. తదుపరి మ్యాచ్‌లు గౌహతి (నవంబర్ 28), రాయపూర్ (డిసెంబర్ 1), బెంగళూరు (డిసెంబర్ 3) నగరాల్లో జరుగనున్నాయి. అయితే, మ్యాచ్‌ జరిగే రోజు నవంబర్ 26న సాయంత్రం 4 గంటలకు వేదిక గేట్లను తెరుస్తామని, పేటిఎం ఇన్‌సైడర్ ద్వారా ఆన్‌లైన్ టిక్కెట్స్ విక్రయాలు జరుగుతాయని, అలాగే విద్యార్థులు రూ. 375 లకే టిక్కెట్‌లను అందిస్తున్నామని కేరళ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × five =