ధ్రువ నక్షత్రం- మరోసారి రిలీజ్ వాయిదా

vikrams dhruva nakshathram movie postponed again

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా వస్తున్న సినిమా ధ్రువ నక్షత్రం. తమిళ్ లో ధృవ నచ్చత్తిరం అంటూ రిలీజ్ అవుతుండగా.. తెలుగులో ధ్రువ నక్షత్రం టైటిల్ తో రిలీజ్ అవుతుంది. స్పై యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈసినిమాలో.. జాన్ అనే స్పై క్యారెక్టర్‌ లో నటిస్తున్నాడు విక్రమ్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నిజానికి ఈసినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. దాదాపు నాలుగేళ్లుగా పెండింగ్ లోనే ఉంటూ వస్తుంది. అయితే ఈమధ్యనే మళ్లీ ఈసినిమా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఈనెల 24వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఆదిశగానే చిత్రయూనిట్ కూడా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీ అయిపోయింది. మేకర్స్ చెప్పినట్టు ఈరోజు ఈసినిమా రిలీజ్ అవ్వాల్సింది. అయితే మరోసారి విక్రమ్ ఫ్యాన్స్ కు షాకిచ్చారు. ఈసినిమా రిలీజ్ ను మరోసారి వాయిదా వేశారు. ఈవిషయాన్ని డైరెక్టర్ గౌతమ్ మీనన్ తన ట్విట్టర్ ద్వారా తెలియచేశారు.

సారీ, ధృవ నక్షత్రం చిత్రాన్ని ఈరోజు థియేటర్ల లోకి తీసుకు రాలేక పోతున్నాం.. ఈరోజు రిలీజ్ చేయాలని చాలా ప్రయత్నించాం.. కానీ, మాకు ఇంకా ఒకటి లేదా రెండు రోజుల సమయం కావాలి. ఆడియన్స్ కి మంచి అనుభూతి అందిస్తామని ఆశిస్తున్నాం అంటూ తెలిపారు.

ఇక ఈసినిమాలో రీతూ శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఐశ్వర్యారాజేశ్‌, సిమ్రాన్‌, రాధికా ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఒండ్రగ ఎంటర్‌టైన్‌మెంట్‌, కొండదువోం ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎస్కేప్‌ ఆర్టిస్ట్స్‌ మోషన్స్ పిక్చర్స్‌ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి హరీష్‌ జైరాజ్‌ సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 1 =