సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసిన తరువాత పవన్ కళ్యాణ్ వరుసగా వకీల్ సాబ్, భీమ్లానాయక్ బ్రో సినిమాలతో హ్యాట్రిక్ ను అందుకున్నాడు. ఇదిలా ఉండగా అందరూ ఇప్పుడు ఆసక్తిగా ఎదురుచూస్తుంది మాత్రం ఓజీ సినిమా కోసం. సుజీత్ దర్శకత్వంలో పవన్ హీరోగా వస్తున్న సినిమా ఓజీ.. (ఒరిజినల్ గ్యాగ్ స్టర్). ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. పవన్ కూడా ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ ను పూర్తిచేసుకున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా గురించి బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు. టైగర్ 3 ప్రమోషన్స్ లో పాల్గొన్న ఇమ్రాన్ హష్మీ ఓజీ సినిమా గురించి చెబుతూ ఓజీ పెద్ద పాన్ ఇండియా ప్రాజెక్ట్.. తెలుగు ప్రేక్షకులకు నేను తెలుసుండొచ్చు కానీ నా సినిమాలు చూసి ఉండరు.. ఈసినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అవ్వాలని కోరుకుంటున్నా.. సుజీత్ ఓజీ కోసం క్రియేట్ చేసిన వరల్డ్..అందులో నా పాత్ర చాలా బాగున్నాయి అంటూ తెలిపాడు.
ఈసినిమాలో ప్రియాంక అరుళ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.. రవి..కె.చంద్రన్ డీవోపీ అందిస్తున్నారు. తెలుగు తోపాటు హిందీ, మలయాళం, తమిళ్ మరియు కన్నడ భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో విడుదలకి సిద్ధమవుతోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: