ప్రభాస్ స్పిరిట్‌ లో నటించడంపై.. రణ్‌బీర్‌ కపూర్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Ranbir Kapoor Expresses His Interest to Work in Prabhas' Spirit Movie

బాలీవుడ్ సూపర్ స్టార్ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘యానిమల్‌’. దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ ఈ సినిమాను థియేటర్లలో చూడటానికి తెగ ఎదురుచూస్తున్నారు. ‘అర్జున్‌ రెడ్డి’ ఫేమ్ సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి తాజాగా విడుదలై ట్రైలర్ యూ ట్యూబ్ లో సెన్సేషన్ సృష్టిస్తోంది. నేషనల్‌ క్రష్‌, కన్నడ భామ రష్మిక మందన్న ఫీ మేల్‌ లీడ్ రోల్‌ పోషిస్తుండగా.. బాలీవుడ్ సీనియర్ నటులు అనిల్ కపూర్ మరియు బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రణ్‌బీర్‌ కపూర్‌ పూర్తి మాస్ క్యారెక్టర్లో నటిస్తుండటం.. అలాగే ‘కబీర్‌ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సందీప్ రెడ్డి రూపొందిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘యానిమల్‌’ మూవీ హిందీ సహా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో డిసెంబర్‌ 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం తెలుగులోనూ ప్రమోషన్స్‌ గట్టిగా చేస్తోంది. దీనిలో భాగంగా రణ్‌బీర్ కపూర్‌, రష్మిక మందన్నా, సందీప్‌ రెడ్డిలతో కలిసి టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న ‘అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే షో’లో సందడి చేశారు. ఈ క్రమంలో రణ్‌బీర్ కపూర్‌ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సందీప్ రెడ్డి దర్శకత్వంలో ప్రభాస్‌ చేయబోయే ‘స్పిరిట్‌’ సినిమాలో నటించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అందులో నాకోసం ప్రత్యేకించి ఏదైనా చిన్న పాత్ర రెడీ చేస్తే.. నేను నటించడానికి రెడీ అని రణ్‌బీర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా రణ్‌బీర్ కపూర్‌, ప్రభాస్ ను ‘అన్న’ సంబోధించడం విశేషం.

కాగా రణ్‌బీర్‌ కపూర్‌ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. దీనిపై మూవీ లవర్స్‌, ప్రత్యేకించి ప్రభాస్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రభాస్‌ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందుతున్న ‘సలార్’, ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ‘కల్కి 2898 ఏడీ’ అనే భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తున్నారు. వీటితో పాటుగా మారుతి డైరెక్షన్‌లో కూడా ఓ సినిమా చేయనున్నారు. ఇక ఇదిలా ఉండగా.. వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో ‘స్పిరిట్‌’ సినిమాను పట్టాలెక్కించనున్నట్లు డైరెక్టర్ సందీప్‌ రెడ్డి ఇదే షోలో వెల్లడించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − 1 =