పుష్ప 2.. టీజర్‌ వస్తోంది, ఇయర్‌ఫోన్స్ రెడీ చేసుకోండి

Pushpa 2 The Rule Teaser to be Out on April 8th

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టైటిల్ రోల్ లో నటిస్తోన్న ఇండియాస్ మోస్ట్ ఎవైటెడ్ చిత్రం ‘పుష్ప 2: ది రూల్‌’. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టుపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఈ ఏడాది ఆగ‌స్టు 15న పాన్ ఇండియా లెవెల్లో థియేట‌ర్ల‌లోకి రానుంది. ఈ క్రమంలో మూవీ టీమ్ కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్‌ జ‌న్మ‌దినం సందర్భంగా ‘పుష్ప 2’ టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు వెల్లడించింది. దీంతో బన్నీ అభిమానులు ఇప్పుడు ఈ అప్‌డేట్ కోసం తెగ ఎదురు చూస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో ‘పుష్ప 2’ చిత్రబృందం తాజాగా మరో అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. మూవీ లవర్స్‌ను ఉద్దేశించి.. ‘ఇయర్‌ఫోన్స్ రెడీ చేసుకోండి. ‘పుష్ప2’ టీజర్‌కు సెన్సేషనల్‌ బీజీఎం రాబోతోంది’ అంటూ పుష్ఫ టీమ్ ఎక్స్ వేదికగా పేర్కొంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌, సుకుమార్, ఈ చిత్ర సంగీత ద‌ర్శ‌కుడు దేవీశ్రీ ప్ర‌సాద్‌తో క‌లిసి మ్యూజిక్ సిట్టింగ్స్‌లో పాల్గొన్నప్పటి ఫోటోను పోస్ట్ చేసింది. కాగా ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

కాగా ‘పుష్ప2’ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుండగా.. సునీల్, రావు రమేష్, అనసూయ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ప్రముఖ మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా చేస్తుండగా.. టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. టాలీవుడ్ అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ మరియు డైరెక్టర్ హోం బ్యానర్ సుకుమార్ రైటింగ్స్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + 6 =