ది గర్ల్ ఫ్రెండ్- రష్మిక బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్

rashmika special birthday poster out from the girlfriend movie

ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది రష్మిక మందన్న. మొదటి సినిమాతోనే మంచి హిట్ ను అందుకున్న రష్మిక ఆ తరువాత వరుస విజయాలు అందుకొని చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. ఇక ఇప్పుడు పుష్ప, యానిమల్ సినిమాలతో దేశవ్యాప్తంగా తన క్రేజ్ ను పెంచుకుంది. ప్రస్తుతం అయితే తెలుగు, హిందీ, తమిళ్ అంటూ ఇలా పలు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అందులో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమా కూాడా ఒకటి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇదిలా ఉండగా నేేడు రష్మిక పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే కదా. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈరోజు టీజర్ రిలీజ్ అయి ఉండేది. కానీ టీజర్ రిలీజ్ ను వాయిదా వేశారు. త్వరలోనే కొత్త టీజర్ రిలీజ్ డేట్ ను తెలియచేస్తానని తెలిపారు. అయితే రష్మిక పుట్టిన రోజు సందర్భంగా బర్త్ డే స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

కాగా అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై విద్యా కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమాకు హేషమ్ అబ్దుల్ సంగీతం, కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − 10 =