ఈ సినిమాకు సైన్ చేసినప్పుడు మా నాన్నతో నేను చెప్పింది అదే – మృణాల్ ఠాకూర్

Family Star Movie Press Meet Actress Mrunal Thakur Thanks To Telugu Audience

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధానపాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఫ్యామిలీ స్టార్’. ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. హోల్‌సమ్ ఎంటర్ టైనర్‌గా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందించారు. ఈ  సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. “ఫ్యామిలీ స్టార్” చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 5న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో గ్రాండ్‌ రిలీజ్‍ అవుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ.. “సీతారామం సినిమాకు వర్క్ చేస్తున్నప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో నాకు ఇంత గొప్ప కెరీర్ ఉంటుందని అనుకోలేదు. సీతారామం తర్వాత హాయ్ నాన్న వంటి మంచి స్క్రిప్ట్ దొరికింది. ఈ రెండు సినిమాల తర్వాత నేను చేసే సినిమాల స్పెషల్‌గా ఉండాలని అనుకున్నా. అలాంటి స్పెషల్ స్క్రిప్ట్‌ను పరశురామ్ గారు నెరేట్ చేశారు. గోవర్థన్, ఇందూ, బామ్మ ఇతర క్యారెక్టర్స్ మధ్య బ్యూటిఫుల్‌గా స్టోరీ ఉంటుంది” అని చెప్పారు.

ఇంకా ఆమె మాట్లాడుతూ.. “మన జీవితం అర చేతిలాంటిది. మన వేళ్లలాగే జీవితంలో కూడా ఎత్తుపల్లాలు ఉంటాయి. కొన్నిసార్లు మన ప్రొఫెషనల్ లైఫ్ చాలా బాగుంటుంది, కానీ పర్సనల్ లైఫ్‌లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. మన జీవితాల్లోని ఎమోషన్స్, రిలేషన్స్, అఛీవ్‌మెంట్స్, స్ట్రగుల్స్ అన్నీ ఈ మూవీలో మీరు రిలేట్ చేసుకుంటారు. ఇక మనకు కష్టాలు వచ్చినప్పుడు మనల్ని ఎంకరేజ్ చేసి ముందుకు నడిపించేవారు కుటుంబంలో ఎవరో ఒకరు తప్పకుండా ఉంటారు. అలాంటి వారిని గుర్తుచేసుకునే ప్రయత్నమే ఈ ఫ్యామిలీస్టార్ సినిమా. ఈ సినిమా సైన్ చేసినప్పుడు నేను మా నాన్నతో, ఈ సినిమా నీకోసమే చేస్తున్నానని చెప్పా” అని గుర్తుచేసుకున్నారు.

“ఇంతమంచి సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడు పరశురామ్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. ఇందు క్యారెక్టర్‌ను నేను పోషించగలనా లేదా అని భయపడ్డాను. కానీ విజయ్ ఎంతో సపోర్ట్ చేశాడు. అలాగే దిల్ రాజు గారు మా అందరికీ బిగ్ సపోర్ట్ ఇచ్చారు. ఫ్యామిలీ స్టార్ కాస్ట్ అండ్ క్రూ మొత్తానికి థ్యాంక్స్. అలాగే నా కుటుంబానికి కూడా థ్యాంక్స్ చెబుతున్నా. యాక్టింగ్ అనేది నా ప్యాషన్. నన్ను నేను చూసుకోగలిగే పాత్రలు, సినిమాలే చేస్తాను. నేను కాదు నా సినిమాలే మాట్లాడాలని భావిస్తుంటా. మీరంతా ఫ్యామిలీ స్టార్ చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా. ముఖ్యంగా తెలుగు అమ్మాయిగా నన్ను యాక్సెప్ట్ చేసినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు” అని తెలిపారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − eight =