టిల్లు స్క్వేర్ ఓవర్సీస్ కలెక్షన్స్ 

tillu square Overseas collections

సిద్దు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ ఓవర్సీస్ లో కూడా అదరగొడుతుంది.నార్త్ అమెరికా లో కేవలం నాలుగు రోజుల్లోనే 2మిలియన్ డాలర్ మార్క్ ను చేరుకొని రికార్డు సృష్టించింది.యూఎస్ఏ తో పాటు  మిగితా దేశాల్లో కలుపుకొని ఈసినిమా 20కోట్ల పైనే గ్రాస్ వసూళ్లను సాధించింది.ఓవరాల్ గా ఓవర్సీస్ లో సెన్సేషనల్ వసూళ్ల ను రాబట్టుకొని డబుల్ బ్లాక్ బాస్టర్ వైపు దూసుకుపోతుంది.ఇక ఈసినిమా తో సిద్దు మొదటి సారి 2మిలియన్ డాలర్ క్లబ్ లో చేరాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అటు తెలుగు రాష్ట్రాల్లో ఈసినిమా రచ్చ లేపుతుంది.ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పోటీ లేకపోవడం అలాగే యూనానిమస్ పాజిటివ్ టాక్ రావడంతో టిల్లు స్క్వేర్ సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటుంది.నాలుగు రోజుల్లో ఈసినిమా 78కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని మేకర్స్ ప్రకటించారు.ఫుల్ రన్ లో 100కోట్ల క్లబ్ లో చేరనుంది.

ఇక ఈసినిమాకు సీక్వెల్ కూడా రానుంది.టిల్లు క్యూబ్ తో థర్డ్ పార్ట్ తెరకెక్కనుంది.టిల్లు స్క్వేర్ ను మల్లిక్ రామ్ డైరెక్ట్ చేయగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది.సితార ఎంటర్టైన్మెంట్స్,శ్రీ కర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మించాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − one =