నారా రోహిత్ హీరోగా 2014లో వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్ ప్రతినిధి సినిమా మంచి ప్రశంసలు దక్కించుకున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు పదేళ్ల తరువాత ప్రతినిధి2 సినిమాతో వస్తున్నారు. ఇక ఈసినిమా జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వంలో వస్తుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ అయితే ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో నారా రోహిత్ ఓ జర్నలిస్ట్‌గా కనిపించబోతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఇంకా టీజర్ లో పొలిటికల్ అంశాలపై ఎక్కువగా ఫోకస్ చేసినట్టు కనిపిస్తుంది. అభివృద్ధి, రాష్ట్ర అప్పు లాంటి అంశాలపై కామెంట్స్ చేసారు. జనం కోసం బతికితే చచ్చాక కూడా జనంలో బతికే ఉంటామనే డైలాగ్, పైన కూర్చొని ఎన్ని అయినా చెబుతారు నీతులు.. మేము ఖర్చు పెట్టింది ఎవడిస్తాడు.. వాడా, వాడమ్మా మొగుడా, చివర్లో వచ్చి ఓటేయండి, లేదా దేశం వదిలి వెళ్లిపోండి, లేదా చచ్చిపోండి అంటూ వచ్చే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.
Thank you, @Kchirutweets garu, for unveiling the teaser. Your words of encouragement and positive energy will always be treasured. Your humility knows no bounds. Once again, thank you for blessing the team of #Prathinidhi2.#Prathinidhi2Teaserhttps://t.co/hMjXUZQPfA
— Rohith Nara (@IamRohithNara) March 29, 2024
కాగా వానర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈసినిమాను కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, కొండకళ్ల రాజేందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తుండగా, నాని చమిడిశెట్టి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: