జపాన్ లో భూకంపంపై కార్తికేయ స్పందన

rajamouli son karthikeya reaction on earthquake in japan

దర్శకుడు జక్కన్న కుటుంబం ప్రస్తుతం జపాన్ లో ఉన్న సంగతి తెలిసిందే కదా. రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా ఆర్ఆర్ఆర్. స్వతంత్య్ర సమరయోధులు కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రల ఆధారంగా ఫిక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా సంచలనాలు సృష్టించింది. ఇక ఈసినిమా స్పెషల్ స్క్రీనింగ్ కోసం రాజమౌళితో పాటు కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లారు. అక్కడ అభిమానులతో కలిసి సినిమా చూసి ఎంజాయ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా తాజాగా జ‌పాన్‌లో భూకంపం చోటుచేసుకుంది. ఇక దీనిపై కార్తికేయ తన ట్విట్టర్ ద్వారా స్పందించాడు. జపాన్‌లో ఇప్పుడే భూకంపం వ‌చ్చింది. మేము 28వ అంత‌స్తులో ఉన్నాం. భూమి కంపించ‌డం ప్రారంభించింది. భూకంపం అని గ్ర‌హించి భ‌యాందోళ‌న‌కు గుర‌య్యా. కానీ, చుట్టుప‌క్క‌ల ఉన్న జ‌ప‌నీయులు పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు. నేను భూకంప అనుభూతి పొందా అని తన ట్వీట్ లో పేర్కొన్నాడు. అలాగే ఈ ట్వీట్‌కు భూకంపం స‌మ‌యంలో త‌న స్మార్ట్ వాచ్‌లో వ‌చ్చిన వార్నింగ్‌ని ఫొటో తీసి కార్తికేయ షేర్ చేశాడు.

కాగా రాజమౌళి తన తదుపరి సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఈసినిమా అప్ డేట్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ కూడా అందించారు. జపాన్ మీడియాతో ముచ్చటించిన ఆయన ఈసినిమా కథ పూర్తయిందని.. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతుందని స్పష్టం చేశారు. కాగా ఈసినిమాను శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కే ఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించబోతున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × two =