చరణ్‌.. ఐ లవ్ యూ – సుకుమార్

Director Sukumar Thanks to Ram Charan at RC 16 Launching Ceremony

‘ఆర్ఆర్ఆర్’తో పాన్ ఇండియా రేంజ్‌లో సెన్సేష‌న‌ల్ క్రియేట్ చేసిన గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా.. తొలి చిత్రం ‘ఉప్పెన’తో బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన బుచ్చిబాబు సానా కాంబినేష‌న్‌లో భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ RC 16 బుధ‌వారం ఘ‌నంగా ప్రారంభ‌మైంది. ఇందులో రామ్‌ చ‌ర‌ణ్ జ‌త‌గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ న‌టిస్తోంది. వృద్ధి సినిమాస్ బ్యాన‌ర్‌పై వెంక‌ట స‌తీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ‌లు మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ స‌మ‌ర్ప‌ణ‌లో సినిమా తెరకెక్కుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో జరిగిన RC 16 ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మానికి మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్, స్టార్ ప్రొడ్యూస‌ర్స్ అల్లు అర‌వింద్, బోనీ క‌పూర్, ఎ.ఆర్‌.రెహ‌మాన్‌, గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, జాన్వీ క‌పూర్‌, చిత్ర ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు సానా, చిత్ర స‌మ‌ర్ప‌కులు సుకుమార్, దిల్ రాజు, శిరీష్, సాహూ గారపాటి, రామ్ ఆచంట, ఎమ్మెల్యే రవి గొట్టిపాటి, నాగవంశీ తదితరులు హాజ‌ర‌య్యారు. ఇక ముహూర్త‌పు స‌న్నివేశానికి మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్ట‌గా బోనీ క‌పూర్ కెమెరా స్విచ్చాన్ చేశారు. శంక‌ర్ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ చేతుల మీదుగా చిత్ర యూనిట్ స్క్రిప్ట్‌ను అందుకున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ.. ‘‘నేను బుచ్చిబాబుకి లెక్కలు మాస్టర్‌గా చదువు చెప్పానని నన్ను గురువుగారు అంటాడు. నిజానికి తను నా దగ్గర డైరెక్షన్ నేర్చుకోలేదు. తను ప్రతి విషయాన్ని చాలా పెద్దగా ఆలోచిస్తాడు. ఉప్పెన సినిమా సమయంలో విలన్‌గా ఎవరినీ అనుకుంటున్నావని అన్నప్పుడు విజయ్ సేతుపతి పేరు చెప్పాడు. తను ఎందుకు చేస్తాడని నేను అన్నాను. సరేనని విజయ్ సేతుపతిని కలిస్తే తన నెరేషన్ విని ఉప్పెనలో విజయ్ సేతుపతి నటించారు” అని తెలిపారు.

ఇంకా అయన మాట్లాడుతూ.. “అలాగే నెక్ట్స్ సినిమా ఎవరితో చేస్తావని అంటే రామ్ చరణ్ అన్నాడు. నేను షాకయ్యాను. అలాగే మ్యూజిక్ డైరెక్టర్‌గా రెహమాన్ గారి పేరు చెప్పగానే నేను అలా ఎప్పుడు అనుకోలేదు అనిపించింది. తను ఏం మాట్లాడినా పెద్దగా ఆలోచిస్తాడు. తన కథపైన తనకున్న నమ్మకం అలా ఉంటుంది. బుచ్చిబాబుకి ఆల్ ది బెస్ట్. చరణ్‌కి ఐ లవ్ యు. చరణ్ ఓసారి కథ విని సినిమా చేస్తున్నామని చెప్పేశాడు. తన మేలు ఎప్పటికీ మరచిపోలేను. ఇంత పెద్ద సినిమాతో నిర్మాతగా పరిచయం అవుతున్నందుకు సతీష్ గారికి అభినందనలు. ఈ ప్రాజెక్ట్ ఇంత పెద్దగా రావటంలో తమదైన పాత్ర పోషించిన నవీన్ గారు, రవిగారికి థాంక్స్’’ అన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − two =