గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా.. తొలి చిత్రం ‘ఉప్పెన’తో బ్లాక్ బస్టర్ సాధించిన బుచ్చిబాబు సానా కాంబినేషన్లో భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ RC 16 బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఇందులో రామ్ చరణ్ జతగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో సినిమా తెరకెక్కుతుంది. ఈ నేపథ్యంలో RC 16 ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ శంకర్, స్టార్ ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్, బోనీ కపూర్, ఎ.ఆర్.రెహమాన్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్, చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సానా, చిత్ర సమర్పకులు సుకుమార్, దిల్ రాజు, శిరీష్, సాహూ గారపాటి, రామ్ ఆచంట, ఎమ్మెల్యే రవి గొట్టిపాటి, నాగవంశీ తదితరులు హాజరయ్యారు. ఇక ముహూర్తపు సన్నివేశానికి మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టగా బోనీ కపూర్ కెమెరా స్విచ్చాన్ చేశారు. శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చేతుల మీదుగా చిత్ర యూనిట్ స్క్రిప్ట్‌ను అందుకున్నారు.
ఈ సందర్భంగా జాన్వీ కపూర్ తండ్రి, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ మాట్లాడుతూ ‘‘హైదరాబాద్ నాకెప్పుడూ రెండో ఇల్లులాంటిది. నిర్మాతగా నేను తెలుగులో ఇదివరకు కొన్ని సినిమాలు చేశాను. మున్ముందు మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నాను. రామ్ చరణ్, జాన్వీ నటిస్తున్న సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. బుచ్చిబాబు తెరకెక్కించిన ‘ఉప్పెన’ సినిమా చూసి రీమేక్ చేయాలని కూడా అనుకున్నాను. ఇక ఈ సినిమా విషయానికి వస్తే నిర్మాతలు నవీన్, రవి, సతీష్‌లకు అభినందనలు’’ అని అన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: