విశ్వంభర.. షెడ్యూల్ అప్‌డేట్

Megastar Chiranjeevi Starrer Vishwambhara Completed Hyderabad Schedule

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మాగ్నమ్ ఓపస్ ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్నారు. ‘విశ్వంభర’లో త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తోండగా.. మరికొందరు స్టార్ హీరోయిన్స్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సోషియో ఫాంటసీగా రూపొందుతోన్న ఈ చిత్రం నుంచి టైటిల్ గ్లింప్స్ విడుదలయ్యాక అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ నేపథ్యంలో మెగా అభిమానుల కోసం తాజాగా చిత్ర యూనిట్ కీలక అప్‌డేట్ అందించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీనిప్రకారం, ‘విశ్వంభర’ హైదరాబాద్‌లో ఓ కీలక షెడ్యూల్‌ను చిత్ర బృందం పూర్తి చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి, త్రిష కృష్ణన్ తదితరులు షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ షెడ్యూల్‌లో కొన్ని టాకీ పార్ట్స్, పాట, యాక్షన్‌ బ్లాక్‌ని చిత్రీకరించారు. ఈ మేరకు చిరంజీవి నివాసంలో సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణితో సహా మొత్తం బృందంతో పాటు త్రిష కొన్ని ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేశారు. “ఇదొక లెజెండరీ, అద్భుతమైన రోజు!” అని ఆమె పోస్ట్ చేశారు. చిరంజీవి, త్రిష, వశిష్ట, కీరవాణి, విక్రమ్, వంశీ, ఛోటా కె నాయుడు, ఎఎస్ ప్రకాష్‌ కనిపిస్తున్న మరో పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

ఈ మెగా ఫాంటసీ అడ్వెంచర్‌ను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ బ్యానర్‌పై.. విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. కాగా మెగాస్టార్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు కోసం పేరొందిన సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు, సంతోష్‌ కామిరెడ్డి ఈ చిత్రానికి ఎడిటర్‌లుగా వ్యవహరిస్తున్నారు. శ్రీ శివశక్తి దత్తా, చంద్రబోస్ లిరిక్ రైటర్స్ కాగా, శ్రీనివాస్ గవిరెడ్డి, గంటా శ్రీధర్, నిమ్మగడ్డ శ్రీకాంత్, మయూఖ్ ఆదిత్య స్క్రిప్ట్ అసోసియేట్‌లుగా ఉన్నారు. విశ్వంభర 2025 సంక్రాంతికి జనవరి 10న విడుదల కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 12 =