టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (భారత వైమానిక దళం) బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీకి యాడ్ ఫిల్మ్ మేకర్, సినిమాటోగ్రఫర్, వీఎఫ్ఎక్స్ స్పెషలిస్ట్ శక్తి ప్రతాప్ సింగ్ హడ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన మాజీ మిస్ యూనివర్స్, బాలీవుడ్ బ్యూటీ మానుషి చిల్లర్ ఫీమేల్ లీడ్ రోల్లో నటించింది. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్, రెనాయ్‌సెన్స్ పిక్చర్స్ బ్యానర్లపై సందీప్ ముద్ద, నందకుమార్ అబ్బినేని సంయుక్తంగా తెరకెక్కించారు. మార్చి 1న థియేటర్లలో రిలీజవగా.. ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో థియేటర్లలో రిలీజైన 3 వారాల గ్యాప్‌లోనే ఆపరేషన్ వాలెంటైన్ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా డైరెక్ట్‌గా ఓటీటీలో ఈ మూవీని రిలీజ్ చేయడం విశేషం. తాజాగా శుక్రవారం నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. అయితే ఈ సినిమాను రెంటల్ విధానంలో రిలీజ్ చేయడం గమనార్హం. దీంతో ఆపరేషన్ వాలెంటైన్ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో వీక్షించాలంటే సబ్‌స్క్రిప్షన్‌తో పాటు అదనంగా 279 రూపాయలు చెల్లించాల్సి వుంటుంది.
ఎయిర్‌ఫోర్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో స్వ్కాడ్రాన్ లీడర్‌గా (ఫైటర్ పైలట్‌గా) వరుణ్ తేజ్, మానుషి చిల్లార్ రాడార్ ఆఫీసర్‌గా నటించారు. నవదీప్, రుహాణి శర్మ కీలక పాత్రలు పోషించారు. కాగా గతంలో జమ్మూ-కశ్మీర్ లోని పుల్వామా వద్ద జరిగిన టెర్రరిస్టుల ఎటాక్, అనంతరం భారత వైమానిక దళం చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో యథార్థ ఘటనల స్ఫూర్తితో ఈ సినిమా తెరకెక్కింది. అయితే సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్, విజువల్స్ బాగున్నాయని టాక్ వచ్చినా.. గతంలో ఇదే పాయింట్‌తో ‘ఫైటర్’, ‘ఉరి’ వంటి హిందీ సినిమాలు రావడంతో.. ప్రేక్షకులు ఆపరేషన్ వాలెంటైన్పై అంతగా ఆసక్తి కనబరచలేదు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: