కల్కి 2898 రిలీజ్ పై అమితాబ్ క్లారిటీ

Amitabh Bachchan Clarity On Kalki Release Date Update

ప్రభాస్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కల్కి 2898ఏడి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. మహాభారతంతో మొదలై 2898 ఏడీ సంవత్సరంలో ముగుస్తుంది ఈ కథ. ఇక ఈసినిమా షూటింగ్ పూర్తి చేసుకుంటూనే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించుకుంటుంది. ఇక చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టనున్నారు. ఈనేపథ్యంలోనే శివరాత్రి సందర్బంగా ఈసినిమా నుండి ప్రభాస్ పాత్రను పరిచయం చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. భైరవ అనే పాత్రలో నటిస్తున్నాడు ప్రభాస్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే తాజాగా అమితాబ్ కూడా ఈసినిమా రిలీజ్ పై మరోసారి క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఈసినిమా షూటింగ్ గురించి పోస్ట్ చేస్తూ.. కల్కి షూటింగ్ నుంచి ఇంటికి వచ్చేసరికి రాత్రి మళ్ళీ లేటయిపోయింది.. ఈ సినిమా చిత్రీకరణ పనులు దాదాపు పూర్తయిపోయాయి. ముందుగా చెప్పినట్టే మే 9వ తేదీనే ఈసినిమా విడుదల కానుంది. ప్రేక్షకులకు ఓ మర్చిపోలేని అనుభూతిని ఇవ్వడానికి ఎంతో మంది కష్టపడి పనిచేస్తున్నాం అంటూ తెలిపారు. దీంతో ఈసినిమా వాయిదా పడుతుందేమో అన్న అనుమానాలకు క్లారిటీ వచ్చినట్టైంది.

కాగా ఈసినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో మరొక హీరోయిన్ బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటానీ కూడా నటిస్తుంది. కమల్ హాసన్ మరో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వైజయంతి మూవీస్‌ పతాకంపై అశ్వనీదత్‌ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి తోట రమణి ఆర్ట్‌ డైరెక్టర్‌ గా వర్క్ చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 1 =