తంగలాన్ వచ్చేది అప్పుడే

pa ranjith about thangalaan movie release

విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ నుండి వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా తంగలాన్. పా రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా ఈ సినిమా వస్తుంది. పీరియాడిక్ యాక్షన్ సినిమాగా కోలార్ గోల్డ్‌ ఫీల్డ్స్‌లోని గనుల్లో పనిచేసే కార్మికుల జీవితం ఆధారంగా ఈసినిమా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. కార్మికుల కోసం పోరాడే యోధుడి పాత్రలో విక్రమ్ కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఈసినిమా నుండి ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ అయితే సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నిజానికి ఈసినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ అనుకోని కారణాల వల్ల ఇంతవరకూ రిలీజ్ కు నోచుకోలేకపోయింది. ముందు జనవరి అనుకున్నారు ఆ తరువాత ఫిబ్రవరి అనుకున్నారు కానీ రిలీజ్ కాలేదు. దీంతో ఈసినిమాకోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఈసినిమా రిలీజ్ పై అప్ డేట్ ఇచ్చాడు డైరెక్టర్ పా రంజిత్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పా రంజిత్.. ఈసినిమా గురించి మాట్లాడుతూ.. తంగ‌లాన్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రస్తుతం లోక్‌స‌భ ఎన్నికల తేదీల ప్రకటన కోసం ఎదురుచూస్తున్నాం. ఎన్నికలు పూర్తయిన తర్వాత సినిమా విడుదల చేస్తామని తెలిపారు.

కాగా ఈసినిమాలో పార్వతి తిరువొత్తు, డేనియల్ కాల్టాగిరోన్, మాళవిక మోహనన్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + 18 =