మాస్ కా దాస్ విశ్వక్సేన్ ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘గామి’. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రానికి విద్యాధర్ కాగిత దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్లో రూపొందిన ఈ సినిమా వి సెల్యులాయిడ్ సమర్పణలో మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. క్రౌడ్ ఫండ్ చేసిన ఈ ఈ మూవీలో తెలుగమ్మాయి చాందినీ చౌదరి కథానాయికగా నటించింది. ట్రైలర్ తర్వాత మంచి బజ్ ఏర్పడటంతో విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొనగా.. అందుకు తగ్గట్టే రిలీజైన తొలిరోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
డిఫరెంట్ కాన్సెప్టుతో వచ్చిన ఈ మూవీకి ఆడియెన్స్ మౌత్ టాక్ స్ప్రెడ్ బాగా కలిసొచ్చింది. దీంతో భారీ ఓపెనింగ్ సాధించింది. ఇక మూవీలో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని, ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్రియన్స్ ఇస్తోందని సాధారణ ప్రేక్షకులతోపాటుగా క్రిటిక్స్ సైతం ఈ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో విశ్వక్ సేన్ నటన అద్భుతంగా ఉందంటూ ఆడియెన్స్ కితాబిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘గామి’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది.
తాజాగా అందిన సమాచారం ప్రకారం.. ‘గామి’ చిత్రం ఫస్ట్ వీకెండ్ గడిచేసరికి ఏకంగా రూ.20 కోట్లకు పైగా వసూలు చేసి దూసుకెళ్తోంది. అలాగే విడుదలైన 4 రోజుల్లో మొత్తం 22.5 కోట్లు కలెక్షన్స్ సాధించింది. ఈ మేరకు విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించారు. ఇక సినిమాకు పాజిటివ్ టాక్ రావడం, ఈ వారంలో మరే పెద్ద సినిమా విడుదల లేకపోవడంతో గామి మరిన్ని కోట్లు కొల్లగొట్టొచ్చని భావిస్తున్నారు. సో మొత్తానికి విశ్వక్ సేన్ ఖాతాలో మరో సాలిడ్ హిట్ పడినట్లే కనిపిస్తోంది.
#Gaami continues its magical journey at the box office ✨
Grosses 22.5 CRORES WORLDWIDE in 4 DAYS ❤️🔥❤️🔥
Book your tickets now for the 𝗧𝗛𝗘 𝗕𝗥𝗘𝗔𝗧𝗛𝗧𝗔𝗞𝗜𝗡𝗚 𝗘𝗣𝗜𝗖 𝗙𝗥𝗢𝗠 𝗧𝗘𝗟𝗨𝗚𝗨 𝗖𝗜𝗡𝗘𝗠𝗔 💥
🎟️ https://t.co/NhQqgNtJlt@VishwakSenActor @iChandiniC… pic.twitter.com/WrEQwCMDey— V celluloid (@vcelluloidsoffl) March 12, 2024
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: