విద్యాధర్ కాగిట దర్శకత్వంలో యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న సినిమా గామి. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈసినిమా రూపొందుతుంది. మనిషి స్వర్శ తెలియని వ్యక్తి ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు అనే కాన్సెప్ట్ తో ఈసినిమా రాబోతుంది. అడ్వెంచరస్ ఫాంటసీ ఫిల్మ్‌గా వస్తోన్న ఈ చిత్రంలో విశ్వక్ సేన్ అఘోరాగా కనిపించబోతున్నాడు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఈసినిమా మార్చి 8వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి వరుసగా అప్ డేట్లు ఇస్తూ క్యూరియాసిటీ పెంచుతున్నారు. ఇక ఇప్పుడు ఈసినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు మేకర్స్. ఈసినిమా నుండి గమ్యాన్నే సాంగ్ ను రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఈనేపథ్యంలోనే తాజాగా ఈపాటను రిలీజ్ చేశారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Search within yourself for your biggest inspiration ✨#Gamyaanne – The Quest Song from #Gaami out now ❤🔥
Grand release worldwide on March 8th 🧿@VishwakSenActor @iChandiniC @KarthikSabaresh @nanivid @mgabhinaya @anuragkulkarni_ @sweekaragasthi pic.twitter.com/YZqWBMrvLW
— V celluloid (@vcelluloidsoffl) February 24, 2024
ఈసినిమాలో చాందిని చౌదరి, అభినయ హీరోయిన్స్ గా నటిస్తుండగా.. మహమ్మద్ సమద్, దయానంద్ రెడ్డి, హారిక పెడన కీలకపాత్రల్లో నటిస్తున్నారు. వి సెల్యూలాయిడ్, కార్తీక్ శబరీష్ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: