న్యాచురల్ స్టార్ నాని మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది దసరా ఇంకా హాయ్ నాన్న సినిమాలతో అలరించగా అందులో దసరా బ్లాక్ బస్టర్ ను అందించగా హాయ్ నాన్న డీసెంట్ హిట్ ను అందించింది. ఇక అదే జోష్ తో ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా రాబోతున్న సినిమా సరిపోదా శనివారం. ఈసినిమాతో ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో రాబోతున్నాడు నాని. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా నేడు ఈసినిమా నుండి అప్ డేట్ ను ఇవ్వబోతున్నట్టు ఎప్పుడో ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఆ టైమ్ రానే వచ్చేసింది. ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. యాక్షన్ ప్యాక్డ్ గా ఉన్న గ్లింప్స్ అయితే సూపర్ గా ఉంది. నాని ఫుల్ మాస్ అవతార్ లో కనిపిస్తున్నాడు.
కాగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో తమిళ్ టాలెంటెడ్ నటుడు ఎస్ జే సూర్య కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ పై నిర్మిస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా, మురళి జి సినిమాటోగ్రాఫర్, కార్తీక శ్రీనివాస్ ఎడిటర్. పాన్ ఇండియా సినిమాగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: