ప్రముఖ నిర్మాణ సంస్థలకు ఇండియన్ 2 తెలుగు రైట్స్

top production houses acquired indian 2 movie telugu rights

లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ఇండియన్ 2. ఈసినిమా శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ అని అందరికీ తెలిసిందే. దాంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా నుండి చాలా కాలం తరువాత ఒక అప్ డేట్ వచ్చింది. ఈసినిమా తెలుగు రిలీజ్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. టాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థలైన ఏషియన్ ఎంటర్టైన్ మెంట్స్ ఇంకా సురేష్ ప్రొడక్షన్స్ పేరు సొంతం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు సంస్థలు కలిసి రిలీజ్ చేయనున్నాయి. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా తమ ట్విట్టర్ ద్వారా తెలియచేశారు.

ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియ భవాని శంకర్ ఫీమేల్ లీడ్ లో నటిస్తుండగా.. సిద్ధార్ధ్, సముద్రఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జియాంట్ మూవీస్ పై ఉద‌య‌నిధి స్టాలిన్‌, సుభాస్కరన్‌ ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 1 =