దేశవ్యాప్తంగా ప్రస్తుతం ‘హనుమాన్’ నామస్మరణ ప్రతిధ్వనిస్తోంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా, భాషతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాలలో ‘హనుమాన్’ సినిమా ఆబాలగోపాలాన్ని ఆకట్టుకుంటోంది. నాడు హనుమంతుడు సూక్ష్మరూపం నుంచి స్థూలరూపం ధరించినట్లు చిన్న సినిమాగా విడుదలై అతి పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. దేశంలోనే కాకుండా ఒవర్సీస్‌లో సైతం ప్రభనజనం సృష్టిస్తోంది. ఈ క్రమంలో సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ మూవీ నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకుపై పైగా వసూలు చేసింది. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ క్రమంలో ఆయన తాజాగా ఒక ఇంగ్లీష్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో హనుమాన్ మేకింగ్, వీఎఫ్ఎక్స్ సహా పలు అంశాలపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. “టాలీవుడ్ నుంచి ఇప్పటివరకూ రామాయణం, మహాభారతం కథల ఆధారంగా ఎన్నో సినిమాలు వచ్చాయి. ఎప్పుడూ మేము తెలుగు చిత్రాల్లో దేవుళ్లను కానీ, పురాణ పాత్రలను కానీ తప్పుగా చూపించలేదు. ఇక మాకు దేవుడి పాత్రలంటే సీనియర్ ఎన్టీఆరే.. కృష్ణుడైనా, రాముడైనా ఆయనే గుర్తొస్తారు. చాలా మంది ఇళ్లలో దేవుడి విగ్రహాలకు బదులుగా ఆయన ఫోటోలు ఉంటాయి. ఎన్టీఆర్ గారు ఇలాంటి సినిమాలు చాలా చేశారు. ఆయన సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరించారు” అని తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ఇలా అన్నారు..”నేను ఈ జానర్‌లో వచ్చే అన్ని చిత్రాలను చూస్తాను. వాటిలో కొన్నింటి నుంచి సినిమా ఎలా తీయాలో నేర్చుకుంటే.. మరికొన్నింటి నుంచి ఎలా తీయకూడదో నేర్చుకుంటాను. నేను ఇతర ఫిల్మ్ మేకర్స్ గురించి మాట్లాడను. కానీ మన దేశ సంస్కృతి, చరిత్రలను ఎప్పటికీ తక్కువ చేయను. రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలను నా శైలిలో ప్రేక్షకులకు చెప్పాలనుకుంటున్నా. అయితే ప్రస్తుతం నాకు అంత పరిణతి లేదు. అందుకే ఆ పాత్రల స్పూర్తితో కొత్త కల్పిత కథలను రూపొందిస్తున్నాను. వాటిద్వారా భారతీయ ఇతిహాసాల్లోని నీతిని నేటి తరానికి అందించే ప్రయత్నం చేస్తున్నా” అని చెప్పారు ప్రశాంత్ వర్మ.
“ఇక హనుమాన్ సినిమా విషయానికొస్తే.. మా దగ్గర ఎక్కువ బడ్జెట్ లేదు. కానీ, తగినంత సమయం ఉంది. అందుకే ఎక్కువ రోజులు పట్టినా పక్కా ప్రణాళిక ప్రకారం తెరకెక్కించాం. పర్‌ఫెక్షన్ కోసమే వీఎఫ్ఎక్స్ కోసం ఎక్కువ సమయం తీసుకున్నాం. హాలీవుడ్ సినిమాల్లోని కల్పిత సూపర్ హీరోల క్యారెక్టర్స్ కంటే కూడా మన పురాణాల్లోని కొన్ని పాత్రలు శక్తివంతంగా ఉంటాయి. అలాంటివాటిలో ముందుగా గుర్తొచ్చేది హనుమంతుడు. అందుకే నేను సూపర్ హీరో తరహా చిత్రం తీయాలని నిర్ణయించుకున్నప్పుడు హనుమాన్ పాత్రనే ఎంచుకున్నా” అని ప్రశాంత్ వర్మ వివరించారు.
కాగా హనుమాన్ సినిమాలో హీరోగా తేజ సజ్జా, హీరోయిన్‌గా అమృత అయ్యర్ నటించగా.. వరలక్ష్మి శరత్ కుమార్, వెన్నెల కిశోర్, సత్య, గెటప్ శ్రీను తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: