ధనుష్-నాగార్జున-శేఖర్ కమ్ముల మూవీ గ్రాండ్ లాంచ్

dhanush and nagarjuna movie grand launch

ప్రస్తుతం ఇండస్ట్రీలో డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ను చూస్తున్నాం. ఒకప్పుడు ఒక హీరో సినిమాలో మరో హీరో చేయడం చాలా అరుదుగా ఉండేది. ఎన్టీఆర్, ఏఎన్నార్ టైమ్ లో అలాంటి సినిమాలు చూశాం. ఆ తరువాత జనరేషన్ లో ఎవరి సినిమాలో వారే చేసుకునేవారు. కానీ ఇప్పుడు మళ్లీ పంథా మారింది. స్టార్ హీరోలు సైతం వేర హీరోల సినిమాల్లో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. పాత్ర నిడివి ఎంత ఉంది అనే విషయాన్ని కూడా పట్టించుకోవట్లేదు. విక్రమ్ సినిమాలో సూర్య కనిపించేది లాస్ట్ పది పదిహేను నిమిషాలు మాత్రమే కానీ తన పాత్ర ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో చూశాం కదా.. అందుకే అతిథి పాత్రలకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పటికే ఎన్నో కాంబినేషన్స్ ను చూడగా.. ఇప్పుడు మరో క్రేజీ కాంబో సెట్ అయింది. ఆ కాంబినేషనే ధనుష్-నాగార్జునది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా వస్తుంది. ఈసినిమాను ఎప్పుడో ప్రకటించినా ధనుష్ వేరే సినిమాలతో బిజీగా ఉండటంతో సెట్స్ పైకి వెళ్లడానికి మాత్రం చాలా టైమ్ పట్టింది. ఈసినిమాలో నాగార్జన కూడా నటిస్తున్నట్టు కన్ఫామ్ చేసేశారు. ఇదిలా ఉండగా ఈసినిమాను నేడు పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ చేసారు.

కాగా ఈసినిమాలో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ పై నారాయణదాస్ కె నారంగ్, పి. రామ్మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తెలుగు, తమిళ్, హిందీ తో పాటు పలు భాషల్లో ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 5 =