కోలీవుడ్ స్టార్ హీరో ‘దళపతి’ విజయ్ గతేడాది ‘లియో’ సినిమాతో బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసారు. ప్రస్తుతం ఆయన క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీకి ‘గోట్’ అనే టైటిల్‌ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ అనేది ఉపశీర్షికగా ఉంది. కాగా ఈ చిత్రంలో జయరాం, ప్రభుదేవా, మోహన్, ప్రశాంత్, వైభవ్, స్నేహ, లైలా, మీనాక్షి చౌదరి తదితరులు నటిస్తున్నారు. ఇక ఈ సినిమా ఏజీఎస్ బ్యానర్‌పై తెరకెక్కుతుండగా.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘లియో’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వస్తోన్న చిత్రం కావడంతో ‘గోట్’పై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతోన్న ఈ చిత్రం షూటింగ్ దేశవిదేశాల్లోని పలు ప్రాంతాల్లో జరుగుతోంది. దీనిలో భాగంగా.. ప్రస్తుతం ఈ సినిమా తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో కీలక షెడ్యూల్ జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో విషయం తెలిసి దళపతి అభిమానులు అక్కడికి భారీగా తరలివచ్చారు. ఇక లొకేషన్‌కు వచ్చిన తన అభిమానులను విజయ్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కొత్త గెటప్‌లో కనిపించి వారిని ఆశ్చర్యపరిచారు. అనంతరం వారితో సెల్ఫీ కూడా తీసుకున్నారు.
దీంతో దళపతి విజయ్ ఫ్యాన్స్ తెగ సంబరబడి పోయారు. అయితే ఆయన మీసాలు లేకుండా కొత్త గెటప్‌లో కనిపించడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. ఆ ఫొటోను చిత్ర బృందం సోషల్ మీడియాలో షేర్ చేయగా.. విజయ్ కొత్త లుక్ వైరల్‌గా మారింది. కాగా దీనిని చూసిన అందరూ అసలు ఈ ఫొటో విజయ్‌దేనా? అని అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొంతమంది అయితే ఇది విజయ్ కాదు, ఆయన బాడీ డబుల్ అని కామెంట్స్ కూడా చేశారు. కానీ మేకర్స్ అఫీషియల్‌గా విజయ్ చిత్రాన్ని విడుదల చేసి అభిమానులకు క్లారిటీ ఇచ్చారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: