రీసెంట్ గానే సార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్న ధనుష్ ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ధనుష్ హీరోగా అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో రూపొందుతోన్న పీరియాడికల్ మూవీ ‘కెప్టెన్ మిల్లర్’. 1930-40ల నేపధ్యంలో ఈసినిమా రూపొందిస్తున్నారు. ఈసినిమా నుండి రిలీజ్ అయిన అప్ డేట్లు అన్నీ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈసారి మరో పాత్ర ప్రధానమైన కథతో ధనుష్ వస్తున్నట్టు అర్థమవుతుంది. ఈసినిమా తమిళ్ వెర్షన్ నేడు రిలీజ్ అయి మంచి టాక్ ను సొంతం చేసుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా తెలుగు వెర్షన్ రిలీజ్ వాయిదా పడుతుందని గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈసినిమాను తమిళ్, తెలుగులో సంక్రాంతికి రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ తమిళ్ లో మాత్రం చెప్పిన డేట్ కే వస్తుంది. అయితే తెలుగు రిలీజ్ మాత్రం కాస్త వెనక్కి వెళ్లింది. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా తెలుగు రిలీజ్ కు సంబంధించిన అప్ డేట్ తో వచ్చేశారు. ఏపీ, తెలంగాణలో ఈసినిమా జనవరి 25వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
#CaptainMiller is set for a grand release in Andhra Pradesh and Telangana by @SureshProdns and @AsianCinemas_ 🔥
Releasing in theatres on Jan 25th!@dhanushkraja #ArunMatheswaran @gvprakash @NimmaShivanna @sundeepkishan @priyankaamohan @SathyaJyothi pic.twitter.com/GuZDej5Q5W
— Suresh Productions (@SureshProdns) January 12, 2024
కాగా ఈసినిమాలో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ నటిస్తుండగా.. సందీప్ కిషన్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను సత్య జ్యోతి ఫిలిమ్స్ బ్యానర్‌పై సెంథిల్ త్యాగరాజన్, ఆర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీని.. నాగూరన్ ఎడిటింగ్‌ను నిర్వహిస్తున్నారు. ఈసినిమాను తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్, ఏషియన్ సంస్థ వారు కలిసి రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: