నా సామిరంగ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్

naa saami ranga movie interesting elements

కింగ్ నాగార్జున కూడా మంచి హిట్ కోసం ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో నా సామిరంగ అంటూ ఈ సంక్రాంతికి వచ్చేస్తున్నారు. ఇక ఈసారి తనకు కలిసొచ్చే మాస్ ఎంటర్ టైనర్ తో వచ్చేస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈసినిమాకు. ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈసినిమాలో ఉన్న ఆసక్తికర విషయాలు ఏంటో ఒకసారి చూద్దాం..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నాగార్జున
ఈసినిమాకు నాగార్జున మెయిన్ పిల్లర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందులోనూ చాలా కాలం తరువాత నాగార్జున ఫుల్ మాస్ తో సందడి చేయడానికి వస్తున్నాడు. మరోవైపు ఎప్పటినుండో నాగార్జున సంక్రాంతికి తన సినిమాలను రిలీజ్ చేసుకుంటూ వస్తున్నాడు. దానికి తగ్గట్టే ఈ సంక్రాంతి పండుగ కూడా నాగార్జునకు బాగానే కలిసొస్తుంది. సోగ్గాడే చిన్నినాయన, బంగార్రాజు సినిమాలు సంక్రాంతికే రిలీజ్ అయి మంచి విజయాలను అందించాయి. ఇప్పుడు సినిమాతో వస్తున్నాడు.

అల్లరి నరేష్
ఈసినిమాలో అల్లరి నరేష్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. నిజానికి ఈసినిమాకు అల్లరి నరేష్ గ్లింప్ రిలీజ్ తరువాతే మంచి బజ్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. ఒకపక్క హీరోగా చేస్తూనే మరోపక్క పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. అలా ఈసినిమాలో అంజి అనే ఒక ఎనర్జిటిక్ రోల్ తో వస్తున్నాడు. గమ్యం సినిమాలో అల్లరి నరేష్ పాత్రను ఎవరూ మరిచిపోలేరు. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. ఇక ఈసినిమా నుండి వచ్చిన ఇంట్రడక్షన్ వీడియో, ట్రైలర్ ను బట్టి అల్లరి నరేష్ ఈసినిమాలో కూడా తమ మార్క్ ను చూపించేలా కనిపిస్తున్నాడు.

నాగార్జున-అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కాంబినేషన్
ఇప్పుడు ఒక హీరో సినిమాలో మరో హీరో నటించడం అనేది కామన్ అయిపోయింది. అలాంటిది ఈసినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కూడా కనిపిస్తున్నారు. వీరి ముగ్గురు కాంబినేషన్ సిల్వర్ స్క్రీన్ పై బాగా ఎంటర్ టైన్ చేసేలా కనిపిస్తుంది. ఫుల్ మాస్ గా నాగార్జున రోల్, కాస్త దూకుడిగా ఉండే ఎనర్జిటిక్ పాత్రలో అల్లరి నరేష్, అలానే అమాయకపు పాత్రలో రాజ్ తరుణ్ పాత్రలు, వారి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచేలా కనిపిస్తున్నాయి.

ఎంఎం కీరవాణి
ఈసినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్లకు ఈమధ్య అవకాశాలు తగ్గుముఖం పట్టాయన్న సంగతి తెలిసిందే. అయితే కీరవాణి మాత్రం పలు సినిమా అవకాశాలను దక్కించుకుంటూనే ఉన్నారు. ఇక ఈసినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలానే టీజర్, ట్రైలర్ లలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంది.

డైరెక్టర్ విజయ్ బిన్ని
ఈమధ్య సినిమాటోగ్రాఫర్ లు, ఎడిటర్ లు కూడా డైరెక్టర్లుగా మారిపోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా డైరెక్టర్ విజయ్ బిన్ని కూడా ఈసినిమాతో డైరెక్టర్ గా మారుతున్నారు. విజయ్ బిన్ని ప్రముఖ కొరియోగ్రాఫర్. తెలుగులో పలు పాటలకు కొరియోగ్రఫి అందించారు. ఇక నాసామిరంగతో మొదటిసారి మెగాఫోన్ పట్టాడు. మరి ఇప్పటివరకూ రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్, పాటలను చూస్తే మేకింగ్ బాగానే ఉన్నట్టు కనిపిస్తుంది. మరి మొదటి సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూద్దాం

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.