బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాని కాంబినేషన్‌లో రూపొందిన భారీ చిత్రం ‘డంకీ’. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 21న గ్రాండ్ రిలీజ్ అవుతుంది. సినిమా ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా బాద్‌షా షారుక్ ఖాన్ గ్లోబల్ విలేజ్ దుబాయ్‌ని చేరుకున్నారు. సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమాపై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దుబాయ్ చేరుకుని డంకీ ప్రమోషన్స్ చేసే క్రమంలో షారూక్ ఖాన్‌కి అక్కడి ప్రజల నుంచి ఘనమైన స్వాగతం లభించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దుబాయ్‌లో ‘డంకీ’ ప్రమోషన్స్ చేస్తున్న షారూఖ్.. దీనిలో భాగంగా దుబాయ్ డెయిరా సిటీ సెంటర్‌ను సందర్శించారు. అక్కడ వి.ఓ.ఎక్స్ సినిమాస్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కింగ్ ఖాన్‌ని చూసిన ఫ్యాన్స్ తెగ హంగామా చేశారు. బాద్షాకు అద్భుతమైన స్వాగతాన్ని పలికారు. ఈవెంట్‌కి వచ్చిన ప్రజల నినాదాలతో ఆడిటోరియం మారుమోగింది. బిగ్గెస్ట్ సూపర్‌స్టార్స్‌లో ఒకరైన షారూక్ ఖాన్‌కి గొప్పగా స్వాగతం పలకటానికి దుబాయ్‌లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. గ్లోబల్ విలేజ్ దుబాయ్‌లోని ప్రేక్షకులకు ‘డంకీ’ ఫీవర్ పట్టుకుంది. వారు కూడా లుట్ పుట్ గయా.. అంటూ పాడుకుంటున్నారు.
కాగా ‘డంకీ’ చిత్రంలో చాలామంది టాలెంటెడ్ ఆర్టిస్టులు ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమవుతున్నారు. బోమన్ ఇరాని, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనీల్ గ్రోవర్ తదితరులు ప్రేక్షకుల హృదయాలను దోచుకోనున్నారు. ఇక ఈ చిత్రాన్ని ఏ జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్, రాజ్‌కుమార్ హిరాణి ఫిల్మ్స్ బ్యానర్స్ సమర్పణలో రాజ్ కుమార్ హిరాణి, గౌరి ఖాన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అభిజీత్ జోషి, రాజ్ కుమార్ హిరాణి, కణిక థిల్లాన్ రచయితలు. ‘డంకీ’ క్రిస్మస్ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున డిసెంబర్ 21న రిలీజ్ అవుతోంది. కాగా ఆ తర్వాతిరోజే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మోస్ట్ అవైటింగ్ ప్రాజెక్ట్ ‘సలార్’ విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇలా ఒక్కరోజు తేడాతో ఈ రెండు భారీ బడ్జెట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తలపడుతుండటంతో ఇద్దరు అగ్ర హీరోల అభిమానులు ఒకింత ఉత్కంఠగా ఉన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: