బిగ్ బాస్ సీజన్ 7 ముగియడానికి మరికొద్ది గంటలు మాత్రమే ఉంది. ఉల్టా పుల్టా అంటూ మొదలైన ఈ సీజన్ చాలా మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకుంది. ఇక చివరి సమయాల్లో కూడా బిగ్ బాస్ హౌస్ మేట్లను ఖాళీగా ఉంచాలనికోవడం లేదు. అందుకే వారికి ఏదో ఒక టాస్క్ ఇస్తూనే ఉన్నాడు. మూడు రోజుల పాటు వారి జర్నీ వీడియోలు వేయగా.. ఆతరువాత ఇంటిఫుడ్ కోసం పలు టాస్క్ లు ఆడాలని చెప్పాడు. దీంతో పలు గేమ్స్ పెట్టగా అందులో ముందుగా అమర్, అర్జున్, శివాజీ ఇంటిఫుడ్ ను గెలుచుకున్నారు. దాంతో గురువారం ఎపిసోడ్ ముగుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక శుక్రవారం ఎపిసోడ్ మొదలవుతుంది. ముందుగా అమర్ కు టాస్క్ ఇస్తాడు బిగ్ బాస్. హౌస్ మేట్ల జాతకం చెప్పాలని చెప్పాడు. ఇక బిగ్ బాస్ ఆదేశాల ప్రకారం అమర్ తన కామెడీతో బాగానే కంప్లీట్ చేశాడు. ఆతరువాత మిగిలిన ప్రశాంత్, యావర్, ప్రియాంకలు ఇంటిఫుడ్ గెలుచుకోవాలంటే అర్జున్, అమర్, శివాజీ చేతుల్లో ఉంటుందని తెలిపాడు బిగ్ బాస్. ఇక ఆ క్రమంలోనే గేమ్స్ పెట్టాడు. ముందుగా ఒక గేమ్ పెట్టగా అందులో అమర్ గెలుస్తాడు. దాంతో అమర్ యావర్ పేరు చెబుతాడు. అయితే వచ్చిన ఫుడ్ వేరొకరితో షేర్ చేసుకోవాలని బిగ్ బాస్ చెప్పడంతో.. ఒకరి పేరు చెబితే మరొకరు ఫీలవుతారని ఫుడ్ వద్దని చెబుతాడు. ఆ తరువాత బ్యాలెన్సింగ్ గేమ్ పెట్టగా ఆ గేమ్ లో అర్జున్ గెలుస్తాడు. అర్జున్ ప్రశాంత్ పేరు చెప్పగా.. ప్రశాంత్ అమర్ తో ఫుడ్ షేర్ చేసుకుంటానని చెబుతాడు. దీంతో ప్రశాంత్ కోసం మటన్ కర్రీ రైస్ ను అమర్, ప్రశాంత్ ఇద్దరూ తింటారు.
ఆ తరువాత అమర్ తన దగ్గర ఉన్న పాయింట్స్ ను ఉపయోగించుకొని తన భార్యతో వీడియో కాల్ మాట్లాడుకునే అవకాశాన్ని దక్కించుకున్నాడు. మరి ఈ సీజన్ టైటిల్ ను ఎవరు గెలుచుకుంటారో తెలియాలంటే మరి కొద్ది గంటలు వెయిట్ చేయాల్సిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: