స్టార్ హీరోయిన్ గా ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో తన సత్తా చాటుతూనే ఉంది సమంత. రీసెంట్ గానే ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సమంత గత కొద్దికాలంగా మరోవైపు మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే చికిత్స కోసం కొంత కాలం గ్యాప్ కూడా తీసుకుంటుంది. అయితే తన నుండి త్వరలో రాబోతున్న వెబ్ సిరీస్ సిటాడెల్. రాజ్ అండ్ డీకే దర్శక ద్వయం దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత, వరుణ్ ధావన్ ప్రధాన పాత్రల్లో వస్తున్న ఈ వెబ్ సిరీస్ వస్తుంది. స్పై యాక్షన్ నేపథ్యంలో ఈసిరీస్ రాబోతుంది. ఈ వెబ్ సిరీస్ ను ఇంగ్లీష్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే కదా. ఇంగ్లీష్ లో రిచర్డ్ మేడెన్, ప్రియాంక చోప్రా నటించారు. దీని హిందీ వెర్షనే ఈ వెబ్ సిరీస్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ఇప్పటికే పూర్తయిన సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే చాలా రోజుల నుండి ఈ వెబ్ సిరీస్ నుండి ఎలాంటి అప్ డేట్ రాలేదు. మరోవైపు ఫ్యాన్స్ మాత్రం ఈవెబ్ సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో తాజాగా ఈ వెబ్ సిరీస్ రిలీజ్ పై క్లారిటీ వచ్చింది. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ లో 2024 ఏఫ్రిల్ 24 నుంచి స్ట్రీమింగ్‌కు రానుంది. మరి ఈవెబ్ సిరీస్ ను చూడాలంటే ఫ్యాన్స్ కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. కాగా హాలీవుడ్ నిర్మాతలు రుసో సోదరులు ఈ వెబ్ సిరీస్ ను నిర్మిస్తుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: