బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన తాజా చిత్రం ‘యానిమల్’. టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకతం వహించిన ఈ మూవీ డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఫస్ట్ షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 550 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. రణ్‌బీర్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అని, డైరెక్టర్ సందీప్ టేకింగ్ హాలీవుడ్ రేంజ్లో ఉందని అభిమానులు పేర్కొంటున్నారు. దీనికితోడు మరోవైపు సాధారణ ప్రేక్షకులతోపాటు పలువురు సినీ ప్రముఖులు ఈ సినిమాను ప్రశంసిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో నేషనల్ అవార్డ్ విన్నర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘యానిమల్’ మూవీపై రివ్యూ ఇచ్చారు. యానిమల్ ఓ సినిమాటిక్ బ్రిలియన్స్ అని కితాబిచ్చిన ఆయన ఈ చిత్రంలో పనిచేసిన రణ్‌బీర్, రష్మిక, బాబీ డియోల్, అనిల్ కపూర్, తృప్తి దిమ్రి సహా దర్శకుడు సందీప్ రెడ్డి వంగాలపై ప్రశంసలు కురిపించాడు. ఈ మేరకు అల్లు అర్జున్ ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టారు. అందులో..””యానిమిల్.. జస్ట్ మైండ్ బ్లోయింగ్. ఈ సినిమాటిక్ బ్రిలియన్స్‌కి పిచ్చెక్కేసింది. కంగ్రాచులేషన్స్. రణ్‌బీర్ కపూర్ జీ ఇండియన్ సినిమా పర్ఫార్మెన్స్ను మీరు కొత్త లెవల్‌కు తీసుకెళ్లారు. చాలా ఇన్స్పైరింగా ఉంది. తెరపై మీరు క్రియేట్ చేసిన మ్యాజిక్ చూసి నాకు మాటలు రావడం లేదు. రష్మిక ఇందులో నీ నటన అద్భుతం. ఇప్పటి వరకూ నువ్వు చూపిన అత్యుత్తమ పర్ఫార్మెన్స్ ఇదే” అని పేర్కొన్నారు.
#Animal . Just mind blowing. Blown away by the cinematic brilliance. Congratulations! #RanbirKapoor ji just took Indian cinema performances to a whole new level. Very Inspiring . I am truly in loss of words to explain the magic you’ve created . My deep Respects to the highest…
— Allu Arjun (@alluarjun) December 8, 2023
ఇంకా అల్లు అర్జున్ ఇలా చెప్పారు.. “బాబీ డియోల్ జీ మీ పర్ఫార్మెన్స్ ఎవరికీ మాటలు లేకుండా చేసింది. అనిల్ కపూర్ జీ మీ అనుభవమే.. మీరేంటో చెబుతోంది. యంగ్ లేడీ తృప్తి దిమ్రి గుండెలు కొల్లగొడుతోంది. మరిన్ని కొల్లగొట్టాలని అనుకుంటున్నాను. అలాగే ఇతర ఇతర ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ వాళ్ల అత్యుత్తమ పర్ఫార్మెన్స్ చూపించారు. కంగ్రాచులేషన్స్. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గారు.. మీరు మైండ్ బ్లోయింగ్. మీరు అన్ని సినిమాటిక్ పరిమితులను అధిగమించారు. ఇంటెన్సిటీకి అసలు ఏదీ సాటిరాదు. మీరు మా అందరినీ గర్వించేలా చేశారు. ఫ్యూచర్లో మీ సినిమాలు ఇండియన్ సినిమాను ఎలా మార్చేయబోతున్నాయో నేను స్పష్టంగా చూడగలను! ఇండియన్ సినిమా క్లాసిక్స్ జాబితాలో యానిమల్ చేరింది” అని కొనియాడారు. కాగా ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: