సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన నాగార్జున, మహేష్ బాబు

Mahesh Babu, Akkineni Nagarjuna Extends Wishes to Telangana CM Revanth Reddy

టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా గురువారం (డిసెంబర్ 7, 2023) ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో నిన్న కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఎల్‌బీ స్టేడియంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై రేవంత్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే ఆయనతో పాటు 11 మంది నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలు పాల్గొన్నారు. వీరితోపాటు మరికొందరు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పీసీసీ చీఫ్‌లు హాజరయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డికి రాజకీయ పార్టీల నుంచే కాకుండా టాలీవుడ్‌ నుంచి కూడా అభినందనలు వెల్లువెత్హుతున్నాయి. కాగా ఇప్పటికే మెగాస్టార్‌ చిరంజీవి, జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్, ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్, ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ నూతన సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలో మరో స్టార్ హీరో అక్కినేని నాగార్జున, సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు యంగ్ హీరో విశ్వక్ సేన్ కూడా కొత్త ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపారు.

ఈ మేరకు అక్కినేని నాగార్జున ట్విట్టర్‌లో.. “తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన డైనమిక్ లీడర్ శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డికి అభినందనలు. మీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాను. అలాగే డిప్యూటీ సీఎం శ్రీ భట్టి విక్రమార్క గారికి మరియు తెలంగాణ నూతన మంత్రివర్గం సభ్యులకు కూడా అభినందనలు” అని పేర్కొన్నారు.

ఇక మహేష్ బాబు దీనిపై.. “తెలంగాణ కొత్త సీఎంగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఎనుముల రేవంత్ రెడ్డి గారికి అభినందనలు! మీ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశగా పురోగమించాలని, దిగ్విజయంగా కొత్త శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు. అలాగే యంగ్ హీరో విశ్వక్ సేన్ తన ఎక్స్ వేదికగా ఇలా చెప్పారు.. “అద్భుతమైన పోరాటంతో ప్రతిపక్షంలో ఉన్న పార్టీని ఒంటరిగా అధికారంలోకి తీసుకొచ్చారు. ఈ అద్భుతమైన ప్రయాణంలో ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి పదవి అందుకున్న ఎనుముల రేవంత్ రెడ్డి అన్నకి అభినందనలు” అని పేర్కొన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 7 =