రివ్యూ : ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్

extra ordinary man telugu review

నటీనటులు : నితిన్,శ్రీ లీల,రాజశేఖర్,రావు రమేష్
ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి
సంగీతం : హారిస్ జైరాజ్
దర్శకత్వం : వక్కంతం వంశీ
నిర్మాణం :  శ్రేష్ట్ మూవీస్

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అల్లు అర్జున్ తో నా పేరు సూర్య తెరకెక్కించి డైరెక్టర్ గా మారాడు ప్రముఖ రైటర్ వక్కంతం వంశీ.ఇక ఈసినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకొని యంగ్ హీరో నితిన్ తో ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే సినిమాను తీశాడు.ప్రచార చిత్రాలు సినిమాకు హైప్ తీసుకొచ్చాయి.సీనియర్ హీరో రాజశేఖర్ ఇందులో నటించడం మరో ప్రత్యేకత.ఈసినిమా ఈ రోజే థియేటర్లోకి వచ్చింది.మరి ఈసినిమా ఎలా వుందో ఇప్పుడు చూద్దాం.

కథ :

అభి (నితిన్) జూనియర్ ఆర్టిస్ట్.ఎప్పటికైనా మంచి నటుడు కావాలని ప్రయత్నాలు చేస్తుంటాడు.అయితే పరిస్థితుల ప్రభావం వల్ల అభి,లిఖిత(శ్రీ లీల) కంపెనీ లో ఉద్యోగం లో చేరతాడు. ఈక్రమంలో లిఖితతో ప్రేమలో పడతాడు.ఇదిలావుండగా అభికి హీరో ఛాన్స్ వస్తుంది.తన స్నేహితుడు చెప్పిన కథ కు ఓకే అని సినిమాకోసం ఉద్యోగాన్ని వదిలేస్తాడు అయితే తన ఫ్రెండ్  మనసు మార్చుకుంటాడు. అభి హీరో గా వద్దు అనుకుంటున్నాడు కానీ అభి మాత్రం చేయాలని ఫిక్స్ అవుతాడు.విచిత్రంగా కథలో చెప్పిన క్యారెక్టర్లు అన్ని అభి జీవితంలోకి వస్తాయి.ఆతరువాత ఏం జరిగింది ఇంతకీ ఆ కథకు విలన్ కు సంబంధం ఏంటి చివరకు అభి అనుకున్నది సాధించాడా అనేదే  మిగితా కథ.

విశ్లేషణ :

ట్రైలర్ తో చెప్పేశారు సినిమా కమర్షియల్ ఎంటర్టైనర్ అని.ఈలాంటి జోనర్ లు నితిన్ కు కంఫర్ట్ జోన్.ఫస్ట్ హాఫ్ లో అసలు కథమీ స్టార్ట్ కాదు అయిన కామెడీ ,యాక్షన్ సన్నివేశాలతో సరదాగా సాగిపోతుంది.ముఖ్యంగా కొన్ని సీన్లు హిలేరియస్ గా పేలాయి.కామెడీ చాలా చోట్ల వర్క్ అవుట్ అయ్యింది.హీరో,తండ్రికి మధ్య వచ్చే సన్నివేశాలు నవ్విస్తాయి అలాగే కొన్ని స్పూఫ్ సీన్లు కూడా వున్నాయి అవికూడా బాగా వర్క్ అవుట్ అయ్యాయి.ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ సెకండ్ హాఫ్ ఫై ఆసక్తిని క్రియేట్ చేస్తుంది.

ఇక సెకండ్ హాఫ్ డీసెంట్ అనిపించేలా వుంది.ఎక్కడా బోర్ కొట్టకుండా బాగా డీల్ చేశాడు దర్శకుడు. ఓవరాల్ గా ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ టైం పాస్ కమర్షియల్ ఎంటర్టైనర్.లాజిక్ లు పక్కన పెట్టి చూస్తే  సినిమా ఎంటర్టైన్ చేస్తుంది.

నటీనటుల విషయానికివస్తే నితిన్ కు అలవాటైన పాత్రే కాబట్టి ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు పెద్దగా కష్టపడలేదు.కామెడీ టైమింగ్,యాక్షన్ సన్నివేశాల్లోలో అదరగొట్టాడు.సినిమా అంతా చాలా హుషారుగా కనిపించాడు.శ్రీలీల పాత్ర నిడివి పెద్దది ఏం కాదు కానీ ఉన్నతంలో బాగా చేసింది. ఇక సీనియర్ హీరో  రాజశేఖర్ తన పాత్రకు న్యాయం చేశాడు.రావు రమేష్, సంపత్ రాజ్,హైపర్ ఆది తమకు అలవాటైన పాత్రల్లో మెప్పించారు.

టెక్నికల్ విషయానికి వస్తే డైరెక్టర్ గా వక్కంతం వంశీ ఓకే అనిపించాడు.రైటర్ గా తను నుంచి ఆశించే అంత కథ రాసుకులేదు కానీ ఎంటర్టైన్మెంట్ విషయంలో లోటు లేకుండా చూసుకున్నాడు.ఇక సంగీతం ఆశయానికి వస్తే హారిస్ జై రాజ్ అందించిన సాంగ్స్ డీసెంట్ గా వున్నాయ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం  అదరగొట్టాడు.ఎడిటింగ్ ఓకే. సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్ గా వుంది.నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్  ఈ సినిమాను నిర్మించింది. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా మంచి క్వాలిటీ తో సినిమాను నిర్మించారు.

ఓవరాల్ గా ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ లాజిక్స్ ను పక్కన పెట్టి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తే నచ్చేస్తుంది. నితిన్ కామెడీ,యాక్షన్ సినిమాలో హైలెట్ అయ్యాయి.పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్లను ఇష్టపడే వారికి ఈసినిమాకు బాగా నచ్చుతుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 3 =