రామ్ చరణ్ ఇంట్లో.. మెగాస్టార్ చిరంజీవితో నెట్‌ఫ్లిక్స్ సీఈవో భేటీ

Netflix CEO Ted Sarandos Meets Ram Charan and Mega Star Chiranjeevi

దిగ్గజ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరండోస్ గ్లోబల్ స్టార్‌ రామ్ చరణ్‌ని కలుసుకున్నారు. గురువారం (డిసెంబర్ 7, 2023) సాయంత్రం హైదరాబాద్ వచ్చిన ఆయన తన టీమ్‌తో కలిసి నేరుగా రామ్ చరణ్ ఇంటికి వెళ్లారు. అక్కడ చరణ్‌తోపాటు ఆయన తండ్రి, మెగాస్టార్ చిరంజీవిని కూడా కలిశారు. అలాగే మెగా ఫ్యామిలీ హీరోలు సాయి ధరమ్ తేజ్ మరియు పంజా వైష్ణవ్ తేజ్ కూడా నెట్‌ఫ్లిక్స్ సీఈవోతో భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారందరూ సెల్ఫీలు దిగారు. రామ్ చరణ్, చిరంజీవిలతో నెట్‌ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరండోస్ కలిసి దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‍గా మారాయి. ఈ ఫొటోలను మెగా అభిమానులు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు పొందారు. ప్రత్యేకించి ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటలో చరణ్, తన కో స్టార్ జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి వేసిన స్టెప్పులు ప్రపంచ వ్యాప్తంగా అలరించాయి. దీంతో ఆ పాట ఏకంగా ఆస్కార్ అవార్డును సైతం కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఆయనకు హాలీవుడ్ నుంచి కూడా ఆఫర్స్ వస్తుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్ సీఈవో సరండోస్ చరణ్ ఇంటికి వెళ్లి ప్రత్యేకంగా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే నెట్‌ఫ్లిక్స్ సీఈవో భేటీ సాధారణంగానే జరిగిందా? లేదంటే రామ్ చరణ్‌తో ఏదైనా బిగ్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారా అన్నదానిపై స్పష్టత లేదు.

ఇక ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమా షూటింగ్‍తో బిజీగా ఉన్నారు. పొలిటిక‌ల్ జోనర్‌లో వస్తున్న ‘గేమ్‌ ఛేంజర్‌’ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రముఖ హిందీ నటుడు హ్యారీ జోష్‌ విలన్‌గా కనిపించనున్నాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ రూపొందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. మరోవైపు చిరంజీవి తన నెక్ట్స్ మూవీ ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సోషియో ఫాంటసిలో నటించనున్న విషయం తెలిసిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 9 =