యానిమల్ ఫస్ట్ వీక్ సాలిడ్ కలెక్షన్స్

ranbir kapoor first week worldwide collections

సందీప్ వంగా దర్శకత్వంలో రణ్‍బీర్ కపూర్ హీరోగా వచ్చిన సినిమా యానిమల్. ఈసినిమా డిసెంబర్ 1వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ కు ముందే ఈసినిమా మంచి ఎక్స్ పెక్టేషన్స్ ను సొంతం చేసుకోగా రిలీజ్ తరువాత కూడా ఈసినిమా అంచనాలను అందుకొని బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. బోల్డ్ అండ్ వైల్డ్ సీన్స్ తో తెరకెక్కిన ఈ సినిమా అందరినీ బాగా ఆకట్టుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా కలెక్షన్స్ విషయంలో కూడా ఎక్కడా తగ్గట్లేదు. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ సునామి సృష్టిస్తుంది. 200 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ చిత్రం 210 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బ్రేక్ ఈవెన్ ను రెండు రోజుల్లోనే బ్రేక్ చేసింది ఈసినిమా. ఇదిలా ఉండగా ఈసినిమా రిలీజ్ అయి వారం రోజులు పూర్తి కావస్తుంది. వారం రోజుల్లో ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా వారం రోజుల్లో 563 కోట్లు వసూలు చేసుకుంది. ఇక ఓవర్సీస్ లో కూడా ఈసినిమా 40 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది.

కాగా ఈసినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించగా.. అనిల కపూర్, బాబి డియోల్, తృప్తి దిమ్రి, బబ్లూ పృథ్వీరాజ్, శక్తి కపూర్, ప్రేమ్ చోప్రా, సురేష్ ఒబెరాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
టీ సిరీస్, సినీ వన్ స్టూడియోస్, భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్స్ పై భూషణ్ ​కుమార్, కిషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, మురాద్ నిర్మించారు. హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించిన ఈసినిమా అమిత్ రాయ్ సినిమాటోగ్రఫి అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.