సలార్ ట్రైలర్ రిలీజ్

prabhas salaar movie trailer out now

మొత్తానికి ఎన్నో రోజుల నుండి వెయిట్ చేస్తున్న టైమ్ రానే వచ్చేసింది. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఎప్పటినుండో వెయిట్ చేస్తుంది సలార్ ట్రైలర్ కోసం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం అయితే ఎక్కడ చూసినా సలార్ మేనియానే నడుస్తుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఈసినిమా వస్తుంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గానే ఈసినిమా వస్తుంది. నిజానికి ఈసినిమా కోసం చాలా కాలంగా ఎదురచూస్తున్నారు సినీ లవర్స్ అందరూ. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల ఈసినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్ గా డిసెంబర్ 22వ తేదీన భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. దీనిలో భాగంగానే ఈసినిమానుండి తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళంలో ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలను పెంచేసింది. యాక్షన్ సీక్వెన్స్,విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ లో హైలెట్ గా నిలుస్తున్నాయి.

కాగా ఈసినిమాలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రేయ రెడ్డి కీలక పాత్రలలో నటిస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్‌ పతాకంపై బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్‌ కిరగందూర్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా భువన్ గౌడ సినిమాటోగ్రఫర్ గా పనిచేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 12 =