టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతా రూత్ ప్రభు నటిగా ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. ‘ఏ మాయ చేసావో’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఆమె అనంతరం అనేక హిట్ సినిమాలలో నటించి ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే ఆమె కేవలం నటనతోనే కాకుండా పలు సామాజికసేవా కార్యక్రమాల్లో సైతం పాల్గొంటుంటారు. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తరచుగా అభిమానులతో టచ్‌లో ఉంటుంటారు. ఈ సందర్భంగా ఆమె తన మనసులోని మాటలను వెల్లడించడానికి ఏ మాత్రం మోహమాటపడరు. ఈ క్రమంలో తాజాగా సమంత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఒక ఈవెంట్‌లో భాగంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వివరాల్లోకి వెళ్తే.. హాలీవుడ్‌లో సూపర్ హీరోస్ నేపథ్యంలో రూపొందే ‘మార్వెల్స్’, ‘ఎవెంజర్స్’ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉంటారన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన ‘ది మార్వెల్స్’ చిత్రం దీపావళి కానుకగా ఈ నెల 10న ఇంగ్లీష్, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా శుక్రవారం ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. దీనిలో పాల్గొన్న సమంత ఈ సినిమాకి సంబంధించి ఓ ప్రత్యేక వీడియోను ఆవిష్కరించింది. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. “కెప్టెన్ మార్వెల్ నాకు అత్యంత ఇష్టమైన సూపర్ హీరో. మార్వెల్ ఇండియాతో కలిసి ప్రయాణం చేయడం థ్రిల్లింగ్‌గా ఉంది. యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌గా ‘ది మార్వెల్స్’ సినిమా ప్రేక్షకులకు థ్రిల్‌ని పంచనుంది. బిగ్ స్క్రీన్‌పై ఈ సినిమాను చూడటం గొప్ప అనుభూతినిస్తుంది” అని పేర్కొన్నారు.
ఇక ‘ది మార్వెల్స్’ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా ఓ రిపోర్టర్.. ‘తెలుగు లో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో సూపర్ హీరో సిరీస్‌ని తీస్తే, అందులో మీరు సూపర్ హీరోలుగా ఎవరిని తీసుకుంటారు’ అని సమంతను ప్రశ్నించారు. దీనికి సమాధానంగా సమంత.. “టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్‌ను ఎంచుకుంటాను. ఎందుకంటే నాకు అతనంటే పిచ్చి. అతనే నా సూపర్ హీరో. అల్లు అర్జున్‌తో పాటుగా విజయ్ దేవరకొండని కూడా తీసుకుంటాను. అలాగే బాలీవుడ్ నుంచి ప్రియాంక చోప్రా మరియు అలియా భట్ వుమెన్ క్యారక్టర్స్‌కి సెలెక్ట్ చేస్తాను’ అని చెప్పారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా సమంత అల్లు అర్జున్ తో కలిసి ‘సన్నాఫ్ సత్యమూర్తి’ అనే సినిమాలో కలిసి నటించారు. ఇక ‘పుష్ప’లో ఒక ఐటెమ్ సాంగ్ లో బన్నీతో స్టెప్పులేశారు. అలాగే విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషి’ అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇక ‘ఖుషీ’ తర్వాత సమంత తెలుగులో మరే చిత్రాన్ని అంగీకరించలేదు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: