ఖైదీ తో ఎంత సర్ ప్రైజ్ అయ్యారో జపాన్ అంత సర్ ప్రైజ్ ఇస్తుంది

karthi interesting comments on japan movie

జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా వస్తున్న సినిమా జపాన్. ఈ హైస్ట్ థ్రిల్లర్ ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు. ఈసినిమా ‘దీపావళి’ కానుకగా నవంబర్ 10న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదలవుతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్‌, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తోంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. న్యాచురల్ స్టార్ నాని ముఖ్య అతిథిగా హాజరైన ప్రీరిలీజ్ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా ఈవెంట్ లో కార్తీ మాట్లాడుతూ.. జపాన్ మన కల్చర్ లో ఉండిపోయే బలమైన కథ. దీనిని ఇంటర్నేషనల్ లెవల్ లో ప్రజెంట్ చేయడానికి పెద్ద టెక్నిషియన్స్ ని తీసుకొచ్చాం. ఎస్ రవి వర్మన్ గారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. అలాగే జీవీ ప్రకాష్ చాలా మంచి స్కోర్ చేశారు. అను చాలా చక్కగా నటించింది. సునీల్ గారితో కలిసిపని చేయడం మంచి అనుభవం. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ తో నాకు మంచి అనుబంధం వుంది. నా 25వ చిత్రాన్ని వారి నిర్మాణంలో చేయడం ఆనందంగా వుంది. తప్పకుండా ఈ చిత్రం పెద్ద విజయాన్ని ఇస్తుందని నమ్మకం వుంది. జపాన్ కథ విన్నప్పుడే నాకు నేను కొత్తగా మారాలని నిర్ణయించుకున్నాను. గెటప్ తో పాటు వాయిస్ ని కూడా ఇందులో మార్చాం. ఈ చిత్రం నా మనసుకు దగ్గరైన చిత్రం. రాజు మురగన్ సమాజం పట్ల ప్రేమ వున్న దర్శకుడు. జపాన్ పాత్రలో స్వార్ధం వుంటుంది. ఈ సమాజం తనకి ఏది ఇచ్చిందో అదే తిరిగి ఇచ్చే పాత్ర తనది. వినోదంతో పాటు ఆలోచింపజేసే ప్రశ్నలు సంధించే చిత్రమిది. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. ఖైదీ చూసినప్పుడు ఈ చిత్రాన్ని అసలు ఎలా ఒప్పుకున్నారని సర్ ప్రైజ్ అయ్యారో జపాన్ చూసి కూడా అలానే సర్ ప్రైజ్ అవుతారు, జపాన్ నాకు చాలా ముఖ్యమైన చిత్రం. జపాన్ నవంబర్ 10న రాబోతుంది. తప్పకుండా అందరూ థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నా అని తెలిపారు.

ఇంకా నిజాయితీగా కష్టపడుతూ మన ప్రతిభని పెంచుకుంటూ వెళితే ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనడానికి ఉదాహరణ నాని. సహాయ దర్శకుడిగా మొదలై, నటుడిగా మారి, కొత్తకొత్త పాత్రలు చేస్తూ, కొత్త దర్శకులని, కొత్త కథలని ప్రోత్సహించే హీరో నాని. ఆయన ప్రతి సినిమా తో సర్ ప్రైజ్ ఇస్తారు. ‘దసరా’లో నానిని చూసి చాలా ఆశ్చర్యపోయాను. జెర్సీ టైం లెస్ ఫిలిం. నాని నటన అద్భుతం. అందరినీ హత్తుకుంది. అలాగే తను నిర్మించే చిత్రాలు, వెబ్ షోస్ కూడా చాలా యూనిక్ గా వుంటాయి. నాని వండర్ ఫుల్ జర్నీకి అభినందనలు. తన ‘హాయ్ నాన్న’ చిత్రానికి ఆల్ ది బెస్ట్ . హాయ్ నాన్న పెద్ద విజయాన్ని అందుకోవాలి. సర్దార్ తర్వాత నాగార్జున అన్నయ్య, అన్నపూర్ణ స్టూడియోస్ జపాన్ చిత్రాన్ని విడుదల చేయడం చాలా ఆనందంగా వుంది. నాగార్జున అన్నయ్య ఫస్ట్ షో చూసి సర్దార్ బాగా ఆడుతుందని కాల్ చేసి చెప్పారు. ఈ చిత్రానికి కూడా అలానే కాల్ చేస్తారనే నమ్మకం వుంది. వంశీ గారితో నాకు ఎంతో మంచి అనుబంధం వుందన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + seventeen =