ప్రయోగాత్మక సినిమాలు చేయడానికి ఎప్పుడూ ముందుంటాడు విలక్షణ నటుడు చియాన్ విక్రమ్. అంతేకాదు జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం విక్రమ్ లిస్ట్ లో పలు సినిమాలతో బిజీగా ఉండగా అందులో ధ్రువ నక్షత్రం సినిమా కూడా ఒకటి. తమిళ్ లో ధృవ నట్చతిరం అనే టైటిల్ తో రిలీజ్ అవుతుండగా.. తెలుగులో ధ్రువ నక్షత్రం అనే టైటిల్ తో రిలీజ్ అవుతుంది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వస్తుంది. అయితే ఈసినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా.. దాదాపు ఐదారేళ్ల తరువాత ఇప్పుడు రిలీజ్ అవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నవంబర్ 24వ తేదీన ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. రీసెంట్ గానే ఈసినిమా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయగా ట్రైలర్ బాగానే ఆకట్టుకుంది. ఇక తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా యూఎస్ ప్రీమియర్స్ కు రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. నవంబర్ 23వ తేదీన ఈసినిమా ప్రీమియర్ షో పడనుంది.
ఇక ఈసినిమాలో రీతూ శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఐశ్వర్యారాజేశ్, సిమ్రాన్, రాధికా ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఒండ్రగ ఎంటర్‌టైన్‌మెంట్, కొండదువోం ఎంటర్‌టైన్‌మెంట్, ఎస్కేప్ ఆర్టిస్ట్స్ మోషన్స్ పిక్చర్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి హరీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: