విలక్షణ నటుడు విక్రమ్ నుండి వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా తంగలాన్. పా రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా ఈ సినిమా వస్తుంది. పీరియాడిక్ యాక్షన్ సినిమాగా కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లోని గనుల్లో పనిచేసే కార్మికుల జీవితం ఆధారంగా ఈసినిమా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. కార్మికుల కోసం పోరాడే యోధుడి పాత్రలో విక్రమ్ కనిపించనున్నాడు. ఇక ఈసినిమా నుండి ఇప్పటివరకూ పలు పోస్టర్లు రిలీజ్ చేయగా పోస్టర్లతోనే సినిమాపై క్యూరియాసిటీని పెంచారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా టీజర్ ను నేడు రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఈనేథ్యంలోనే తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ అయితే అదిరిపోయింది. విక్రమ్ గెటప్ కానీ విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్నీ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఒక్క డైలాగ్ కూడా లేేని టీజర్ తోనే సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశారు.
The son of Gold rises🔥⚔️
Unveiling the spine-chilling #ThangalaanTeaser✨
▶️https://t.co/Oxbmf5LuoG#Thangalaan #ThangalaanFromJan26@Thangalaan @chiyaan @beemji @kegvraja @officialneelam @parvatweets @MalavikaM_ @DanCaltagirone @gvprakash @NehaGnanavel @agrajaofficial… pic.twitter.com/LxuXmV6psC— Studio Green (@StudioGreen2) November 1, 2023
కాగా ఈసినిమాలో పార్వతి తిరువొత్తు, డేనియల్ కాల్టాగిరోన్, మాళవిక మోహనన్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈసినిమా విడుదవుతుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























