బుక్ మై షోలో భగవంత్ కేసరి హవా  

bhagavanth kesari create strom in book my show

దసరాకు బరిలో దిగి విన్నర్ గా నిలిచింది బాలకృష్ణ భగంవత్ కేసరి.మొదటి రోజు నుండి సాలిడ్ వసూళ్లను దక్కించుకుంటూ బ్లాక్ బాస్టర్ హిట్ దిశగా దూసుకుపోతుంది.ఇప్పటికే దాదాపు అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసింది.12రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 132కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.ఇందులో షేర్ 65కోట్లు.ఇక ఈసినిమా బుక్ మై షోలో హావ కొనసాగించింది.ఇప్పటివరకు 1.23 మిలియన్ కుపైగా టికెట్స్  బుక్ అయ్యాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అటు యూఎస్ఏ లో కూడా  భగవంత్ కేసరి బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.1.5మిలియన్ డాలర్ల వసూళ్లను  రాబట్టింది.ఇక ఈసినిమా తో బాలయ్య హ్యాట్రిక్ హిట్లు కొట్టాడు.2021చివర్లో అఖండ,ఈఏడాది సంక్రాంతికి వీర సింహా రెడ్డి ,దసరా కు భగవంత్ కేసరి లతో తన ఫామ్ ను కొనసాగిస్తున్నాడు.అటు డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా ఫామ్ కొనసాగించాడు.భగవంత్ కేసరి కూడా విజయం సాధించడంతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనే ట్యాగ్ ను నిలుపుకున్నాడు.

యాక్షన్&ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన భగవంత్ కేసరిలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా శ్రీ లీల కీలక పాత్రలో కనిపించింది.తమన్ సంగీతం అందించాడు.షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహుగారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + seventeen =