కల్కి2898 ఏడీ విఎఫ్ఎక్స్ ఇండియాలో చేయాలన్నదే గోల్

nag ashwin interesting comments on kalki 2898 AD movie VFX work

బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు ప్రభాస్. ఇక ఇప్పుడు అన్నీ పాన్ ఇండియా సినిమాలతో బిజీ అయిపోయాడు. ప్రస్తుతం ప్రభాస్ లిస్ట్ లో పలు సినిమాలు ఉండగా.. వాటిలో ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంది మాత్రం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న కల్కి సినిమా కోసం. ఈసినిమా షూటింగ్ అయితే శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, వీడియోలు రిలీజ్ చేయగా అవి సినిమాపై క్రేజ్ ను మరింత పెంచాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేశాడు నాగ్ అశ్విన్. తాజాగా నాగ్ అశ్విన్ విఎఫ్ఎక్స్ సమ్మిట్ 2023 కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈసందర్భంగా ఆయన కల్కి 2898 ఏడీ సినిమా గురించి మాట్లాడుతూ.. మేక్ ఇన్ ఇండియా స్పూర్తి తో ఈసినిమా విఎఫ్ఎక్స్ వర్క్ ఇండియాలోనే మేనేజ్ చేయాలనేది నా ఫస్ట్ గోల్.. అయితే అది 100 శాతం సాధ్యంకాకపోయినా సినిమాలో ఉన్న మేజర్ పోర్షన్ విఎఫ్ఎక్స్ వర్క్ ను మాత్రం ఇండియాలోనే పూర్తి చేశాము అని తెలిపాడు. కానీ నా నెక్ట్స్ ప్రాజెక్ట్ విఎఫ్ఎక్స్ మాత్రం ఇండియాలోనే చేస్తాను అంటూ స్పష్టం చేశాడు.

కాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుంది. మరొక హీరోయిన్ బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటానీ, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ మరో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వైజయంతి మూవీస్‌ పతాకంపై అశ్వనీదత్‌ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి తోట రమణి ఆర్ట్‌ డైరెక్టర్‌ గా వర్క్ చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × one =