బిగ్ బాస్7- హీటెక్కించిన 9వ వారం నామినేషన్స్

bigg boss telugu season 7 9th week nominations

బిగ్ బాస్ 7 లో అలా మొదలైందో లేదో అప్పుడే 8 వారాలు పూర్తయిపోయి 9 వ వారంలోకి అడుగుపెట్టింది. ఇక గత వారం ఎనిమిది మంది నామినేషన్స్ లోకి రాగా అందులో సందీప్ ఎలిమినేట్ అవ్వడంతో హౌస్ నుండి బయటకు వచ్చేశాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక 9వ వారం మొదలైపోయింది. కొత్తగా కెప్టెన్ బాధ్యతలు తీసుకున్న గౌతమ్ సరికొత్తగా ఐడియాస్ తో వచ్చాడు. తనకు అసిస్టెంట్లుగా డిప్యూటీ కెప్టెన్లు అంటూ రతిక, శోభాను నియమించాడు. అంతేకాదు హౌస్ లో ఉన్న లేడీ కంటెస్టెంట్ లకు బంపరాఫర్ కూడా ఇచ్చాడు. ఈవారం ఫీమేల్ వీక్ అంటూ వారు ఎలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదంటూ హాలీడే ఇస్తున్నానని చెబుతాడు. అంతేకాదు పనిచేసిన విధానాన్ని బట్టి కష్టజీవి, పనిదొంగ అనే బిరుదులు కూడా ఇవ్వబడతాయి అంటూ తెలిపాడు.

మరి సోమవారం అంటే అందరూ ఆసక్తిగా ఎదురుచూసేది ఎలిమినేషన్స్ గురించి. ఈ వారం నామినేషన్స్ ను కూడా మొదలుపెట్టాడు బిగ్ బాస్. ఇంటిలో ఉండటానికి అనర్హులు ఎవరో తెలుపుతూ ఇద్దరు సభ్యులను నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఈనేపథ్యంలో ముందుగా వచ్చిన ప్రశాంత్ అమర్ దీప్ ను నామినేట్ చేస్తూ కెప్టెన్సీ టాస్క్ లో తనను తప్పించడానికి చెప్పిన రీజన్ నచ్చలేదని చెప్పాడు. ఆ తరువాత తేజని నామినేట్ చేస్తూ అదే రీజన్ చెప్పాడు. కెప్టెన్సీ టాస్క్ నుండి తప్పించడం నచ్చలేదని చెప్పాడు.

ఆ తర్వాత వచ్చిన ప్రియాంక రతికను అలానే భోలే ను నామినేట్ చేసింది. రతిక ను తిరిగి వచ్చిన తర్వాత బాగా ఆడుతావని అనుకున్నా కానీ ఆరేంజ్ లో ఆడటంలేదని అలానే భోలేని కెప్టెన్సీ టాస్క్ నుండి తప్పించడానికి చెప్పిన రీజన్ నచ్చలేదని చెప్పింది. శివాజీ అమర్ దీప్ ను తేజాను, అర్జున్ శోభా, అమర్ దీప్ ను.. రతిక ప్రియాంక, శోభాశెట్టిని.. తేజ అర్జున్, రతికను.. భోలే ప్రియాంక, అమర్ దీప్ ను నామినేట్ చేయడంతో ఎపిసోడ్ పూర్తవుతుంది. మిగిలిన నామినేషన్స్ నేడు జరగనున్నాయి. మరి ఫైనల్ గా ఈవారం ఎవరు ఎలిమినేషన్ లోకి వస్తారో తెలియాలంటే నేటి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + 5 =