హాయ్ నాన్న టీజర్ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసిన హీరో నాని

Hi Nanna Teaser Release Date Announced by Hero Nani

నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘హాయ్‌ నాన్న’. తండ్రీ,కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఎమోషనల్ కమ్ లవ్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతోంది. నాని 30గా వస్తోన్న ఈ చిత్రానికి శౌర్యువ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో బేబీ కైరా ఖన్నా నాని కూతురుగా చేస్తుండగా.. హీరోయిన్‌ యశ్న పాత్రలో ‘సీతారామం’ ఫేమ్ మృణాళ్‌ ఠాకూర్ నటిస్తోంది. ఈ నేపథ్యంలో.. మూవీ ప్రమోషన్స్ కార్యక్రమాలను మొదలుపెట్టారు మేకర్స్. డిసెంబర్‌లో క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ క్రమంలో మేకర్స్ సినిమాకు సంబంధించి ఒక్కో అప్‌డేట్‌ ఇస్తూ మూవీపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ వీడియో మరియు ‘సమయమా’, ‘గాజు బొమ్మ’ అనే సాంగ్స్‌ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ఈ సినిమా నుంచి మరో అద్దిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది చిత్రబృందం. ‘హాయ్‌ నాన్న’ సినిమా టీజర్‌ రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. ఆదివారం (అక్టోబర్ 15, 2023) ఉదయం 11 గంటలకు టీజర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు హీరో నాని తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా ఈరోజు తెలియజేశారు. ఈ సందర్భంగా.. “నేను నిన్ను నమ్ముతాను, నువ్వు నన్ను నమ్ము… మ్యాజిక్ అవుతుంది” అంటూ ఒక నోట్‌ను కూడా షేర్ చేశారు. అలాగే మూవీ యూనిట్ కూడా సోషల్ మీడియాలో దీనికి సంబంధించి ఇలా తెలిపింది.. “కళ్ళు మూసుకున్నాయి, హృదయాలు విశాలంగా తెరిచి ఉన్నాయి. నేచురల్ స్టార్ నాని మరియు మృణాల్ ఠాకూర్ ఇరువురూ అక్టోబర్ 15వ తేదీ ఉదయం 11:00 గంటలకు హాయ్ నాన్నా టీజర్‌తో మీ హృదయాలను దోచుకోబోతున్నారు” అని పేర్కొంది. సో.. మూవీ లవర్స్.. ‘హాయ్ నాన్న’ టీజర్ చూసేయడానికి గెట్ రెడీ.

కాగా ఈ సినిమాకు సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తుండగా.. ప్రముఖ మలయాళ కంపోజర్, ‘ఖుషి’ ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నారు. సాను జాన్ వర్గీస్ ఇంతకుముందు నాని హీరోగా వచ్చిన ‘జెర్సీ’, ‘శ్యామ్‌ సింగరాయ్‌’ సినిమాలకు పనిచేయడం గమనార్హం. ఇక ఈ సినిమాను వైరా ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై మోహన్‌ చెరుకూరి, డాక్టర్ విజేందర్‌ రెడ్డి తీగల, మూర్తి కేఎస్‌ గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం తెలుగు సినిమాలకు దేశవ్యాప్తంగా క్రేజ్ పెరిగిన నేపథ్యంలో.. ‘హాయ్ నాన్న’ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − 2 =