బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న స్కంద.. ఫస్ట్ డే క‌లెక్ష‌న్స్‌ ఎంతంటే?

Skanda Box Office Collections Day 1 Ram Pothineni Gets Career Highest Gross Ever

మాస్ డైరెక్టర్ బోయ‌పాటి శ్రీను, ఉస్తాద్ రామ్‌ పోతినేని క‌ల‌యిక‌లో రూపొందిన ‘స్కంద’ సినిమా గురువారం థియేటర్లలోకి వచ్చింది. తెలుగుతో పాటు పాన్ ఇండియా లెవెల్‌లో ఈ సినిమా రిలీజైంది. తొలినుంచీ సినిమాపై నెలకొన్న భారీ అంచనాల కారణంగా విడుదలైన అన్నిచోట్లా ప్రేక్షకుల సందడి కనిపిస్తోంది. బోయ‌పాటి శ్రీను మార్క్ సినిమా ఇదని ప్రేక్షకులు కితాబిస్తున్నారు. ఇక రామ్ పోతినేని కెరీర్‌లో ఫ‌స్ట్ టైమ్ పూర్తిస్థాయి మాస్ పాత్ర‌లో న‌టించిన సినిమా కూడా ఇదే కావడం విశేషం. కంప్లీట్ ఔట్ అండ్ ఔట్ మాస్ క్యారెక్ట‌ర్‌లో రామ్ న‌ట‌న ఫ్యాన్స్‌ను మెప్పిస్తోంది. తన ఎనర్జీ లెవెల్స్ ఏంటో మరోసారి ఈ సినిమాలో ప్రూవ్ చేశాడు రామ్. ఆంధ్రా, తెలంగాణ యాసల్లో చెప్పిన డైలాగ్స్‌కి థియేటర్లో మంచి స్పందన వస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక బాక్సాఫీస్ వద్ద స్కంద సంచలనం సృష్టిస్తోంది. రామ్ -బోయపాటి కాంబో వర్కవుట్ అయిందనేలా టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్లలో దూసుకుపోతోంది. ఈ క్రమంలో మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా రూ.18.2 కోట్ల గ్రాస్‌తో సత్తా చాటింది. తద్వారా రామ్ కెరీర్‌లోనే హ‌య్యెస్ట్ ఓపెనింగ్స్ రాబ‌ట్టిన మూవీగా నిలిచింది. ఇక ఈ మూవీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 8.62 కోట్ల షేర్‌ను రాబ‌ట్టింది. ఈ క్రమంలో అత్య‌ధికంగా నైజాం ఏరియాలో 3.23 కోట్ల క‌లెక్ష‌న్స్ రాగా.. సీడెడ్‌లో 1.22 కోట్లు, వైజాగ్‌లో 1.19 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. అలాగే గుంటూరులో 1.04 కోట్లు కలెక్ట్ చేసింది.

రివేంజ్ యాక్ష‌న్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల లీడ్ రోల్ చేయగా.. ‘మేజర్’ ఫేమ్ సయీ మంజ్రేకర్‌ మరో ప్రధాన పాత్రలో కనిపించింది. సీనియర్ నటులు దగ్గుబాటి రాజా, శ్రీకాంత్, గౌతమి, ప్రిన్స్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కాగా ఈ చిత్రాన్ని ప‌వ‌న్ కుమార్ స‌మ‌ర్పణలో శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్స్ ప‌తాకంపై శ్రీనివాస చిట్టూరి అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు, నిర్మాణ విలువలతో భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇక ఇదిలా ఉండగా.. స్కంద చిత్రానికి సీక్వెల్ రానుందని సినిమా చివర్లో ప్రకటించి అభిమానులకు స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు దర్శకుడు బోయపాటి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × five =