భారత్‌లోని వివిధ భాషల చిత్రపరిశ్రమలకి చెందిన పలువురు ప్రముఖ నటీమణులు గురువారం పార్లమెంట్ భవన్‌ను సందర్శించారు. ప్రధానమంత్రి కార్యాలయం నుండి వచ్చిన పిలుపు మేరకు వారు ఈరోజు ఢిల్లీలోని ప్రధాని కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వీరిలో తమన్నా భాటియా, మెహరీన్ పిర్జాదా, మంచు లక్ష్మీ, సీనియర్ యాక్ట్రెస్ ఖుష్బూ సుందర్, దివ్యా దత్తా సహా పలువురు నటీమణులు ఉన్నారు. ఈ సందర్భంగా నటీమణులందరూ కలిసి దిగిన ఫోటోను నటి ఖుష్బూ తన ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. అలాగే దీనికి ‘విమెన్ ఎన్పవర్మెంట్, విమెన్స్ రిజర్వేషన్ బిల్ 2023, న్యూ ఢిల్లీ’ అని కేప్షన్ కూడా ఇచ్చారు. ఇక ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ ఇప్పుడు అవుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Women power!! #WomenEmpowerment #WomenReservationBill2023 #NewDelhi pic.twitter.com/340Z3GcxHJ
— KhushbuSundar (@khushsundar) September 21, 2023
కాగా తాజాగా జరుగుతున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకొచ్చిన మహిళా బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర కేబినెట్ ఈ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో పార్లమెంటులో సుదీర్ఘ చర్చ జరిపిన అనంతరం ఒకటి, రెండు పార్టీలు మినహా అన్ని పార్టీలు ఈ బిల్లుకి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. అలాగే ఈ బిల్లుకి పార్లమెంటులో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ పార్టీలు బీఆర్ఎస్, వైఎస్సార్సీపీ, తెలుగుదేశం పార్టీలు కూడా సంపూర్ణ మద్దతు తెలిపాయి.
ఈ నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖ నటీమణులకు ఢిల్లీకి రావలసిందిగా ప్రధానమంత్రి కార్యాలయం నుండి ప్రత్యేక ఆహ్వానాలు అందాయి. దీంతో తెలుగుచిత్ర పరిశ్రమ నుంచి మంచు లక్ష్మి.. అలాగే ఇతర పరిశ్రమల నుండి మరికొందరు నటీమణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి కార్యాలయంలో వీరందరూ కొద్దిసేపు సందడి చేశారు. కాగా మహిళా రిజర్వేషన్ బిల్ ఆమోదం పొందిన సందర్భాన్ని పురస్కరించుకుని వీరికి దాని గురించి వివరించనున్నారని, ఇంకా మహిళా సాధికారత సాధించే క్రమంలో దేశంలోని సాధారణ మహిళలకు స్ఫూర్తిగా నిలిచేలా వీరందరూ తమ తోడ్పాటు అందించాలని కోరనున్నట్లు తెలుస్తోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: