నటీనటులు : శ్రీ సింహ కోడూరి, కావ్య కళ్యాణ్ రామ్ ,గౌతమ్ వాసుదేవ్ మీనన్
ఎడిటింగ్ : కార్తీక్ కట్స్
సినిమాటోగ్రఫీ : పవన్ కుమార్ పప్పుల
సంగీతం : అకీవా
దర్శకత్వం : ఫణిదీప్
నిర్మాతలు : రజినీ కొర్రపాటి,రాకేష్ రెడ్డి
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మత్తు వదలరాతో సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కీరవాణి తనయుడు శ్రీ సింహ.ఇది హిట్ అనిపించుకుంది అయితే ఆ తరువాత చేసిన సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇక ఈ సారి శ్రీ సింహ, ఉస్తాద్ తో అదృష్టాన్ని పరిక్షించుకోవడానికివచ్చాడు.బలగం ఫేమ్ కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా నటించింది. ఈసినిమా ఈరోజే థియేటర్లలోకి వచ్చింది. మరి ఉస్తాద్ ఎలా వుందో ఇప్పుడు చూద్దాం.
కథ :
సూర్య (శ్రీ సింహ) చిన్న వయసులోనే తండ్రిని కోల్పోతాడు. దాంతో అతని తల్లి అన్ని తానై పెంచుతుంది అయితే సూర్య కు ఎత్తైన ప్రదేశాలు అంటే భయం.డిగ్రీ లో ఉండగా సూర్య ఓ పాత బైక్ ను కొనుక్కుంటాడు. ఆ బైక్ కు ఉస్తాద్ అని పేరు పెట్టుకుంటాడు. అది తన జీవితంలో ఒక భాగమవుతుంది.ఏదైనా దానితోనే షేర్ చేసుకుంటాడు. ఇక కాలేజ్ లో సూర్యకి మేఘన(కావ్య కళ్యాణ్ రామ్) తో పరిచయం అవుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమ గా మారుతుంది. ఇదిలావుండగా ఆతరువాత సూర్య కి ఫైలట్ కావాలనే కోరిక కలుగుతుంది. ఎతైన ప్రదేశాలంటే భయపడే సూర్య చివరికి ఎలా ఫైలెట్ అయ్యాడు. ఈప్రయాణం లో ఉస్తాద్ ఎలా సహకరించింది.ఇంతకీ సూర్య, మేఘన ఒక్కటయ్యారా లేదా అనేదే మిగితా కథ.
విశ్లేషణ :
కథ పరంగా చూసుకుంటే ఓ మధ్య తరగతి కుర్రాడు సూర్య ఓ బైక్ తన జీవితాన్నిఎలా ప్రభావితం చేసింది అనేదే మెయిన్ ప్లాట్.ఫస్ట్ హాఫ్ లో సూర్య, మేఘన లవ్ స్టోరీ, అలాగే సూర్య కి బైక్ మధ్య నడిచే సన్నివేశాలతో డీసెంట్ అనిపిస్తుంది. సూర్య, మేఘన ప్రేమ కథ చాలా సహజంగా అనిపిస్తుంది.వారిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంది. ఇక బైక్ అలాగే మెకానిక్ మధ్య సన్నివేశాలు కూడా బాగున్నాయి.
ఇక సెకండ్ హాఫ్ లో సూర్య కు ఫైలట్ అవ్వాలనే కోరిక మొదలవ్వడం ఆతరువాత ఆ కలను ఎలా నెరవేర్చుకున్నాడు.ఆ ప్రయాణం లో ఎలాంటి అవరోధాలు ఎదురయ్యాయి అనేది చూపించారు. సెకండ్ హాఫ్ లో స్లో అయినా ఫీలింగ్ కలుగుతుంది కానీ ముగింపుకి వచ్చే సరికి మళ్ళీ గాడిలో పడింది. ఓవరాల్ గా కొంచెం స్లో గా వున్నా ఉస్తాద్ డీసెంట్ అనిపిస్తుంది.
ఇక నటీనటుల విషయానికి వస్తే సూర్య పాత్రలో శ్రీ సింహ అదరగొట్టాడు. నటన పరంగా చాలా ఇంప్రూవ్ అయ్యాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో బాగా చేశాడు. అలాగే మేఘన పాత్రలో కావ్య కళ్యాణ్ రామ్ మెప్పించింది. ఈరోల్ లో చాలా సహజంగా నటించింది.ఇక హీరో తల్లిగా నటించిన అను హాసన్ నటనతో కట్టిపడేసింది. గౌతమ్ వాసుదేవ్ మీనన్,వెంకటేష్ మహా అతిధి పాత్రల్లో కనిపించారు.
టెక్నికల్ సినిమా ఉన్నతంగా వుంది అకీవా అందించిన సాంగ్స్ పెద్దగా రిజిస్టర్ అవ్వవు కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.ఎడిటింగ్,సినిమాటోగ్రఫి డీసెంట్ గా వున్నాయి. నిర్మాణ విలువలు పర్వాలేదనిపించాయి.
ఓవరాల్ గా ఉస్తాద్ కథ నేపథ్యం,హీరో హీరోయిన్ల నటన ,ఎమోషనల్ సన్నివేశాలు హైలైట్ అయ్యాయి.కొంచెం ఓపిక తోని చూస్తే మాత్రం ఉస్తాద్ మెప్పిస్తుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: