నటీనటులు : అశ్విన్ బాబు,నందితా శ్వేత,శ్రీనివాస్ రెడ్డి
ఎడిటింగ్ : ఎమ్ ఆర్ వర్మ
సినిమాటోగ్రఫీ :రాజశేఖర్
సంగీతం : వికాస్ బాడిస
దర్శకత్వం : అనిల్ కన్నెగంటి
నిర్మాత :గంగపట్నం శ్రీధర్
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ట్రైలర్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన చిన్న సినిమా హిడింబ.అశ్విన్ బాబు,నందితా శ్వేత జంటగా నటించారు.ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకె ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో ఈరోజు ఈసినిమా థియేటర్లోకి వచ్చింది.మరి ఈసినిమా ఎలా వుందో ఇప్పుడు చూద్దాం.
కథ:
హైదరాబాద్ లో వరసగా అమ్మాయిల కిడ్నాపులు జరుగుతుంటాయి.ఈకేసును ఐపీఎస్ ఆఫీసర్ ఆద్య (నందితా శ్వేత)కి అప్పగిస్తారు.ఈ ఆపరేషన్ లో పోలీస్ ఆఫీసర్ అభయ్( అశ్విన్ బాబు ) కూడా జాయిన్ అవుతాడు.ఆద్య,అభయ్ కి పోలీస్ శిక్షణ తీసుకునే సమయంలోనే పరిచయం అవుతుంది ఆతరువాత వారిద్దరు ప్రేమలో పడడం అనుకోని కారణాల వల్ల విడిపోవడం కూడా జరిగిపోతుంది.మళ్ళీ ఈ కిడ్నాప్ కేసు విషయంలో ఇద్దరు కలిసి పనిచేస్తారు.ఇంతకీ వీరిద్దరూ ఆకిడ్నాప్ కేసును ఛేదించారా ?అసలు హంతకుడిని కనిపెట్టారా ?ఈక్రమంలో వారికి ఎదురైనా సమస్యలు ఏంటి ? ఈకథకు గిరిజన జాతి హిడింబాలకు వున్న లింకేంటి? అనేది మిగితా కథ.
విశ్లేషణ :
ఇంతకుముందు ఎవరు టచ్ చేయని పాయింట్ తో కథ అల్లుకొని దాన్ని తెరమీదకు తీసుకొచ్చాడు డైరెక్టర్ అందుకు అతన్ని అభినందించాల్సిందే.ఆ పాయింట్ కోసమైనా సినిమాను ఓసారి చూడొచ్చు.
ఫస్ట్ హాఫ్ లో నగరంలో అమ్మాయిల కిడ్నాప్ ఆతరువాత కేసును ఛేదించేందుకు ఆద్యా రంగంలో దిగడంతో కథ పరుగులుపెడుతుంది.ఇంట్రస్టింగ్ స్క్రీన్ ప్లే తో ఫస్ట్ హాఫ్ అంతా ఎంగేజింగ్ గా అనిపిస్తుంది.లీడ్ పెయిర్ మధ్య వచ్చే సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయి.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అలరిస్తుంది.
ఇక సెకండ్ హాఫ్ లోనే అసలు కథ స్టార్ట్ అవుతుంది.అసలు హంతకుడు ఎవరు ఆక్రమంలో వచ్చే ట్విస్ట్లు థ్రిల్ చేస్తాయి.గిరిజన హిడింబాల ఎపిసోడ్ సినిమాకు హైలైట్ గా నిలిచింది.యాక్షన్ ఎపిసోడ్స్ ,క్లైమ్యాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటాయి.చివర్లో ఈసినిమాకు సీక్వెల్ కూడా వుండనుందని హింట్ ఇచ్చాడు డైరెక్టర్.డిఫ్రెంట్ జోనర్ సినిమాలను ఇష్టపడేవారికి ఈసినిమా నచ్చుతుంది.
నటీనటుల విషయానికి వస్తే అశ్విన్ బాబు సినిమాకోసం చాలా కష్టపడ్డాడు.యాక్షన్ సన్నివేశాలు అలాగే క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాల్లో చాలా బాగా నటించాడు.ఇక ఆద్య పాత్రలో నందితా శ్వేత అదరగొట్టింది. ఆపాత్రకు ఆమె పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది అలాగే మకరందేశ్ పాండే పాత్ర సప్రైజ్ చేస్తుంది.ఆపాత్రను చాలా బాగా డిజైన్ చేశారు.మిగితా పాత్రల్లో నటించిన శ్రీనివాస్ రెడ్డి,రాజీవ్ కనకాల,రఘు కుంచే,సంజయ్ స్వరూప్ వాళ్ళ పాత్రలు పరిధి మేర నటించారు.
టెక్నికల్ డిపార్ట్మ్మెంట్ విషయానికి వస్తే సంగీతం,సినిమాటోగ్రఫీ సినిమాకి మెయిన్ ప్లస్ అయ్యాయి.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా సన్నివేశాలు ఎలివేట్ చేసింది.సినిమాటోగ్రఫీ బాగుంది.విజువల్స్ చాలా క్వాలిటీ గా వున్నాయి.నిర్మాత సినిమాకు చాలానే ఖర్చు చేశాడు.
ఓవరాల్ గా డిఫెరెంట్ కాన్సెప్ట్ తో ఇంతకుముందు ఎవరు చెప్పని కథని చెప్పాడు డైరెక్టర్. ఈప్రయత్నంలో సక్సెస్ అయ్యాడు.స్టోరీ,యాక్షన్ ఎపిసోడ్స్,క్లైమాక్స్ సినిమాలో హైలైట్ అయ్యాయి.రెగ్యులర్ మూవీస్ కాకుండా డిఫరెంట్ జోనర్ మూవీస్ ను చూడాలనుకునే వారికి ఈసినిమా బెస్ట్ ఆప్షన్.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: